calender_icon.png 31 January, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్‌చార్జులతో నెట్టుకొస్తున్నారు

31-01-2025 01:03:47 AM

* రెగ్యులర్ వీసీల్లేక ఆ నాలుగు యూనివర్సిటీల్లో పడకేసిన పాలన

* బాసర ట్రిపుల్ ఐటీకి పదేండ్లుగా సమస్యలే..

* మహిళా వర్సిటీ, ఫైన్‌ఆర్ట్స్ యూనివర్సిటీలదీ అదే పరిస్థితి

హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్ల సమస్య ఇంకా తొలగిపోలేదు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఇన్‌చార్జి వీసీల వ్యవస్థ ఇంకా కొనసాగుతూనే ఉంది. నాలుగు యూనివర్సిటీలకు ఇన్‌చార్జి వీసేలే కొనసాగుతుండడం గమనార్హం. దీంతో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది.

విద్యాశాఖ పరిధిలో రాష్ట్రంలో 12 ప్రభుత్వ యూనివర్సిటీలు ఉన్నాయి. అయితే వీటిలో జేఎన్టీయూ, బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ), జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌యూ), వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో ప్రస్తుతం ఇన్‌చార్జి వీసీలు కొనసాగుతున్నారు.

మిగిలిన 8 యూనివర్సిటీలకు మూడు నెలల కిందటే ప్రభుత్వం రెగ్యులర్ వీసీలను నియమించింది. అయితే గత డిసెంబర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సి టీకి వీసీని నియమించింది. వీటితో పాటే జేఎన్టీయూ, జేఎన్‌ఏఎఫ్ యూలకూ సెర్చ్ కమిటీ లను అప్పట్లో వేశారు. దీంట్లో జేఎన్టీయూ సెర్చ్ కమిటీ అప్పుడే భేటీ అయింది.

కానీ, కొత్త వీసీ పేరును ఇంతవరకూ ప్రకటించలేదు. రెగ్యులర్ వీసీ స్థానంలో ఇన్‌చార్జి వీసీని నియమించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డిని జేఎన్టీ యూ వీసీగా ఇటీవల నియమించారు. మరోపక్క ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ సెర్చ్ కమిటీ సమా వేశం ఇంతవరకూ జరగలేదు. ఈ రెండు వర్సిటీలకు ప్రభుత్వం ఇటీవలె రెండోసారి కొత్తగా ఇన్‌చార్జులను నియమించింది. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ, మహిళా యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించలేదు. 

ఇది రెండోసారి..

మూడు నెలల క్రితం జేఎన్టీయూ సెర్చ్ కమిటీ సమావేశమై, ముగ్గురి పేర్లను ప్రతిపాదించింది. కానీ, దానిపై సర్కారు నిర్ణ యం తీసుకోలేదు. అయితే గత మే నెలలో ఆ వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి పదవీకాలం ముగియడంతో నాటి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. ఇటీవల ఆయ న్ను టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించడంతో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డికి ఆ వర్సిటీ ఇన్చార్జీ వీసీగా బాధ్యతలు అప్పగించారు.

మే లో వేసిన సెర్చ్ కమిటీ.. అక్టోబర్‌లో భేటీ అయినా, ఇప్పటికీ ఎందుకు వీసీ పేరును ఎంపిక చేయలేదనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సెర్చ్ కమిటీ సిఫార్సు చేసిన ముగ్గురి పేర్లలో ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారని ప్రచారం జరి గింది. దీంతోపాటు విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి కావాలనే కొత్త వీసీ నియామకం కాకుండా అప్పట్లో అడ్డుకున్నారనే ప్రచారమూ జరిగింది.

రాష్ర్టంలోని ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత పెద్ద యూనివర్సిటీగా గుర్తింపు ఉన్న జేఎన్టీయూకు రెగ్యులర్ వీసీ లేకపోవడంతో వర్సిటీలో కీలక నిర్ణయాలు పెండింగ్‌లో పడిపోతున్నాయని వర్సిటీ వర్గాలు తెలుపుతున్నాయి. ఈనెల 27న సెర్చ్ కమిటీ మరోసారి భేటీ అయి ముగ్గురు పేర్లను సిఫార్సు చేయనుంది. ఆతర్వాత రెగ్యులర్ వీసీని ప్రకటించే అవకాశముంది.

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసలు ప్రొఫెసర్లే లేరు. ప్రొఫెసర్లు, అసొసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కలిపి 11 యూనివర్సిటీల్లో మొత్తం సాంక్షన్డ్ పోస్టులు 2,817 ఉంటే, అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది కేవలం 757 మంది మాత్రమే. 2060 ఖాళీలున్నాయి.

పదేండ్ల నుంచి ఇన్‌చార్జులే..

రాష్ట్రంలోని ఉస్మానియా, కేయూ, జేఎన్టీయూ తర్వాత ఆ స్థాయి వర్సిటీ ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్ ఐటీ వర్సిటీయే. ఈ క్యాంపస్ వేలాది మంది విద్యార్థులతో కొనసాగుతోంది. కానీ, దీనికి ఏకంగా పదేండ్ల నుంచి ఇన్‌చార్జి వీసీలే కొనసాగుతున్నారు. ఇప్పటికీ ఇన్‌చార్జి వీసీతోనే నెట్టుకొస్తున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క మహిళా వర్సిటీకి కూడా ఇన్‌చార్జినే నియమించడంపై విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఫైన్ ఆర్ట్స్ పరిస్థితి అంతే. నాణ్యమైన విద్య, పరిశోధ నలకు నిలయాలైన విశ్వవిద్యాలయాలకు ఇన్‌చార్జి వీసీలనే కొనసాగిస్తుండ టంతో వర్సిటీలు గాడిలో పడేదెప్పుడని విమర్శలు వినిపిస్తున్నాయి.