calender_icon.png 19 November, 2024 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవి రాజకీయ ప్రేరేపిత దాడులు

19-11-2024 01:03:29 AM

బంగ్లాలో హిందువులపై నిరసనలను ఖండించిన యూనస్

మైనారిటీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా

ఢాకా, నవంబర్ 18: బంగ్లాదేశ్‌లో కమ్యూనల్ ముసుగులో హిందువులపై జరుగుతున్న దాడులన్నీ రాజకీయ ప్రేరిపతమైనవని తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ స్పష్టం చేశారు. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న వరుస దాడులతో దేశాన్ని అస్థిరపరిచడమే లక్ష్యంగా కొన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. ‘దేశంలో హింస జరుగుతున్న మాట వాస్తవమే. దేశంలో ఉండే మైనార్టీల(హిందువులు)కు ప్రభుత్వం అండగా నిలుస్తుంది.

మీ భద్రతకు కట్టుబడి ఉన్నాం’ అని యూనస్ స్పష్టం చేశారు. కాగా బంగ్లాలోని 17 కోట్ల జనాభాలో 8శాతం ఉన్న హిందువులు ఈ ఏడాది దుర్గా పూజ జరుపుకున్న సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. వారిపై ఇతర వర్గాలకు చెందిన ప్రజలు దాడులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈ ఏడాది ఆగస్టులో రిజర్వేషన్లపై అల్లర్లు జరిగన నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా బంగ్లాను వదిలి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. ఆమె రాజీనామా చేసింది మొదలు బంగ్లాలోని హిందువులపై వరుస దాడులు జరుగుతున్నాయని పలు అంతర్జాతీయ మీడియా పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి.