calender_icon.png 12 January, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా భూమిని కాజేయాలని కుట్ర చేస్తుండ్రు...

03-01-2025 07:58:32 PM

అమ్మలని ఒత్తిడికి గురి చేస్తుండ్రు.. 

సరిహద్దులు జరుపుతూ ఇబ్బందులకు గురి చేస్తుండ్రు..

భూ బాధితుడు ఎంటి పరశురాములు... 

రామయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో తన భూమిని అమ్మాలని పలుమార్లు ఒత్తిళ్లు చేస్తే అమ్మకపోవడంతో చుట్టుపక్కల ఉన్న ఇద్దరు రైతులు సరిహద్దులు ఉన్న ఒడ్లు జరుపుకుంటూ భూభాగాన్ని తగ్గించే ప్రయత్నం చేయడంతో పాటు ఈ విధంగా అయినా అమ్మించే ప్రయత్నం చేస్తున్నారని నిజాంపేట మండలం రజకుపల్లి గ్రామానికి చెందిన రైతు పరశురాములు విలేకరులతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు ఒక ఎకరం ఏడు గంటల భూమి నిజాంపేట రెవెన్యూ శివారు పరిధిలో ఉందని తెలిపారు. అయితే తన భూమి పక్కనే ఉన్న మరో ఇద్దరు రైతులు తరచూ భూమి చదును చేసుకుంటున్నామని ఉద్దేశంతో తన భూమిలోకి పద్దుదాటి రావడం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఇలా జరిగితే గ్రామ పెద్దలతో పాటు అధికారులతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదని బోరున విలపించడం జరిగింది. అయితే తన భూమిపై కొందరు రియల్టర్లతో పాటు పక్కనే ఉన్న రైతులు కూడా కుట్ర పని తన భూమిని అందించే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టిన తాను లొంగక పోవడంతో తరచు ఓడ్లు జరుపుకుంటూ తన భూమిని ఒక ఎకరం ఏడు గంటల భూమిని విస్తీర్ణం తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎవరికి చెప్పిన తన సమస్య పరిష్కారం కావడం లేదని ఎవరు కూడా స్పందించడం లేదని పేద రైతు అయిన తనకు ఏమి చేయాలో అర్థం కావడం లేదని బోరున విలపించడం జరిగింది. ఒకవేళ తన భూమి విషయంలో ఇదే తరహాలో సమస్య పెరిగితే తనకు ఆత్మహత్య శరణ్యమని తన ఆశలని భూమిపైనే ఉన్నాయని రైతు పరుషరాములు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.