calender_icon.png 19 November, 2024 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీక్ష తీసుకున్నారని స్కూల్లోకి రానివ్వలే..

19-11-2024 01:32:16 AM

నాచారం సెయింట్ పీటర్స్ స్కూల్ ముందు ఆందోళన 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (విజయక్రాంతి): అయ్యప్ప మాల వేసుకున్నారనే కారణంతో ఇద్దరు విద్యార్థులను స్కూల్ ల్లోకి అనుమతించని ఘటన నాచారంలోని సెయింట్ పీటర్స్ స్కూల్‌లో జరిగింది. స్కూ ల్ యాజమాన్యం వైఖరిని నిరసిస్తూ విద్యార్థుల కుటుంబసభ్యులు, అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు.

స్కూల్ ముందు బైటాయించి యాజమాన్యాన్ని నిలదీశారు. ఓ విద్యార్థి తండ్రి మాట్లాడుతూ ఈ నెల ఆరో తేదీన తమ కుమారుడికి అయ్యప్ప మాల కోసం యాజమాన్యం అనుమతి కోరామని, లిఖితపూర్వకంగా కూడా ఇచ్చామన్నా రు. కాగా గత శనివారం యాజమాన్యం తమ పిల్లలకు అనుమతించలేదని చెప్పారు. అనంతరం పోలీసుల జోక్యంతో స్కూల్ యాజమా న్యం విద్యార్థులను అనుమతించింది.