24-02-2025 12:00:00 AM
సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మిసెస్’. జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తొలుత ‘గ్రేట్ ఇండియన్ కిచెన్’ పేరుతో తమిళం, తెలుగు భాషల్లో వచ్చింది. దీన్నే తాజాగా ‘మిసెస్’ పేరుతో హిందీ ప్రేక్షకులకు అనుగుణంగా రీమేక్ చేశారు. అయితే ఈ సినిమాను ఉద్దేశించి బాలీవుడ్ నటి, కంగనా రనౌత్ పరోక్ష విమర్శలు చేశారు.
సామాజిక మాధ్యమాల్లో ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దలు ఆ కుటుంబాలనికి మానసిక ధైర్యాన్ని ఇస్తుంటారు. ఎన్నో విలువైన విషయాలను నేర్పిస్తుంటారు. మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి.. అందులో సందేహం లేదు.
బాలీవుడ్‌లో వచ్చే ప్రేమకథా చిత్రాలను వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని తగ్గించేలా చిత్రీకిస్తున్నారు. జీవితం చాలా చిన్నది. మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగిపోవాలి. గుర్తింపు కోసం ఎక్కువగా పోరాటం చేస్తే చివరకు ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది’ అని ఆమె రాసుకొచ్చారు.