calender_icon.png 7 February, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుట్టలను.. నేల చేస్తుండ్రు

07-02-2025 12:30:36 AM

  1. కంటికి కనిపించినా... అటువైపు చూడని అధికారం 
  2. అటవీ భూమిలో తవ్వారని జేసీబీ, టిప్పర్లు సీజ్ 
  3. మా భూమి అంటూ రెవెన్యూ... మా అడవి అంటూ అటవీ శాఖ
  4. హద్దులు తేల్చే పనిలో ఇరు శాఖల అధికారులు 
  5. సీజ్ చేసి నెల రోజులైనా జరిమానా విధించలే 
  6. ప్రక్రియ కొనసాగుతుంది : సత్యనారాయణ, డీఎఫ్‌వో 

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి) : ప్రభుత్వం పలుమార్లు ప్రకటనలు జారీ చేస్తూ... ఇది ప్రభుత్వ ఆస్తి.. మన అంద రిదీ.. అంటూ కొన్ని ప్రభుత్వ సంస్థలు ప్రకట నలు జారీచేస్తున్న విషయం విజయ క్రాంతి దినపత్రిక చెబుతున్నవారు బాగా అవగతం చేసుకున్నట్టు ఉన్నారు. ఏదైనా కనిపిస్తే అది మాదే నేమో మన అందరి దేమో అనుకు న్నారో ఏమో తెలియదు కానీ...

గుట్టలను నేలను చేసే ప్రయత్నం రాత్రి పగలు ఆపకుం డా పరుగులు పెడుతుండ్రు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్న పేట్ డంపిం గ్ యార్డ్ సమీపంలో ఉన్న గుట్టలను నేలను చేసేలా తవ్వకాలు చేపట్టారు.

నిత్యం అధికా రులు ఉన్న ప్రాంతంలోనే గుట్టలను నేలను చేస్తున్న అధికారులకు మాత్రం అక్రమా ర్కుల పనులు చివరి దశకు వచ్చేవరకు గమ్ముగా ఉండి చివరి దశలో అట విశాఖ అధికారులు మాభూమిలో ఉన్న గుట్టలపై మట్టిని తవ్వుతున్నారని జెసిబి, రెండు టిప్పర్లను సీజ్ చేశారు.

సీట్ చేసి నెల రోజులు గడుస్తున్నా నేటికీ అక్రమంగా మట్టిని తరలిస్తూ పట్టుబడిన వాహనాలకు మాత్రం నేటికీ సంబధిత శాఖ అధికారులు జరిమానా విధించలేదు. ఎందుకు ప్రత్యేక కారణాలు లేకపోలేదు. 

మీ భూమినా.... మా భూమినా...

అటవీశాఖ, రెవెన్యూ శాఖ ఇరువురికి పాలమూరులో వీరన్నపేట్ ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు చేపట్టిన భూమి తమది అంటే ? తమది ? అనేలా ఇరు శాఖల అధికారులు అంటుండ్రు. అటవి శాఖ భూ మిలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని గుర్తించి సీజ్ చేసిన అడవి శాఖ అధికారులు నేటికీ నెల రోజులకు పైగా గడుస్తున్న సీట్ చేసిన వాహనాలకు జరిమానా విధించలేక పోయిండ్రు.

ఇందుకు రెవెన్యూ శాఖ హద్దులు నిర్ణయించకపోవడమే కారణమని అడవిశాఖ చెబుతుంది. అటవీ శాఖ, రెవిన్యూ శాఖ ప్రజాధనాలను కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న శాఖలే. ఇక్కడ మాత్రం ఒక శాఖ సీజ్ చేసిన మరో శాఖ మాత్రం హద్దులు నిర్ణయించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపణలు ఊపొందు కుంటున్నాయి. 

 మట్టికి మస్తు డిమాండ్...

మట్టే కదా అని తీసి పరేయకండి.. పట్టణ ప్రాంతాల్లో ఆ మట్టికి ఉన్న డిమాండ్ వేరు. ఇండ్ల నిర్మాణం, పెద్దపెద్ద భవనం నిర్మాణం లో మట్టి దిగువ స్థానం నుంచి పై స్థానంకు వచ్చేందుకు ఎంతో తోడ్పడుతుంది. ఎందు కు ఒక టిప్పర్ కు మట్టికి టిప్పర్ పరిధిని బట్టి రూ 10 వేల వరకు ధర ఉంటుంది.

నేషనల్ హైవే 167 నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ ఈ గుట్టల నుంచి మట్టిని అక్ర మంగా తరలించారని అడవి శాఖ వారికి నోటీసులు జారీ చేసింది. అడవి భూమి తేల్చాలని రెవెన్యూ శాఖ అధికారులను కూడా అటవీ శాఖ సంప్రదించిందని సం బంధిత అధికారులు తెలిపారు. మట్టికి మస్తు డిమాండ్ ఉండడంతో మట్టి వ్యాపా రంపై అక్రమార్కులు తమ పంజా విసిరేందు కు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుండ్రు. 

సీజ్ చేశాం..

మా దగ్గర ఉన్న మ్యాపులను ఆధారంగా చేసుకుని మా పరిధిలో అడ వి గుట్టలపై నుంచి మట్టిని తరలించిన ట్లు గుర్తించడం జరిగింది. అటవీ భూ మితో పాటు రెవెన్యూ భూములు కూ డా అక్కడ ఉన్నాయి. హద్దులు పూర్తి స్థాయిలో నిర్దేశించిన అనంతరము సీజ్ చేసిన వాహనాలకు జరిమానా విధించ డం జరుగుతుంది. సీజ్ చేసి ఇప్పటికే నెల రోజులు పూర్తయింది. తదుపరి ప్రక్రియ జరుగుతుంది. 

 సత్యనారాయణ, 

డీఎఫ్‌వో, మహబూబ్ నగర్