12-02-2025 01:35:49 AM
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈవీఎంల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారంటూ సుప్రీం ఈసీని ప్రశ్నించింది. ఈవీఎంలలో ఉన్నడాటాను తొలగించొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల తర్వాత ఈవీఎం డాటా విషయంలో ఎలా వ్యవహరిస్తారో వివరాలను 15 రోజుల్లో తమకు అందించాలని ఈసీని ఆదేశించింది.