calender_icon.png 31 October, 2024 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నరు

13-09-2024 01:10:34 AM

కౌశిక్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేయాలె  

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ 

హైదరాబాద్,సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని  విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ఆంధ్రా వాళ్లు బతకడానికి వచ్చారని అవమానించేలా మాట్లాడారని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లను గెలిపించి ఆ పార్టీ పరువును ఆంధ్రా సెటిలర్సే కాపాడారని ఆయన పేర్కొన్నారు. అవసరం తీరిపోయిన తర్వాత బతకడానికి హైదరాబాద్ వచ్చారని మాట్లాడటం సరికాదన్నారు. కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను    బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. 

 విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు: కూన 

ప్రాంతీయ విభేదాలను సృష్టించి మళ్లీ లబ్ధి పొందాలని బీఆర్‌ఎస్ నేతలు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ నేత బండి రమేశ్ తో కలిసి గాంధీభవన్‌లో మీడియాతో మా ట్లాడుతూ గతంలో కేసీఆర్ ఆంధ్రకు వెళ్లి అందరం కలిసుండాలని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే గాంధీని అవమానించే విధంగా మాట్లాడిన కౌశిక్‌రెడ్డిపై చర్య లెందుకు తీసుకోవడం లేదని నిలదీశారు.  

 పిచ్చి పట్టింది : మెట్టు  

బీఆర్‌ఎస్ నాయకులకు పిచ్చి పట్టిందని ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్  మండిపడ్డారు.  గురువారం ఆయన గాంధీభవన్‌లో  పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.