ఎమ్మెల్యే వేముల
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రుణ మాఫీ పేరిట రైతులను మభ్యపెడుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. రైతులకు కేసీఆర్ చేసినంత మేలు ఎవరూ చేయలేదని శుక్రవారం ఒక ప్రకటనలో గుర్తుచేశారు. రైతు సంక్షే మం గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించిన ట్టే ఉందన్నారు. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ రైతుబంధు, రైతు బీమా ఎందుకు ఇవ్వలే దన్నారు. 31 వేల కోట్లు ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటించి కేవలం రూ.6 వేల కోట్లు మాఫీ చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ర్టంలో లక్ష లోపు రుణం ఉన్న రైతులు 37 లక్షల మంది ఉంటే, ఇప్పుడు ఆ రైతుల సంఖ్యను 11 లక్షల మందికే పరిమి తం చేయడం ఏంటని ప్రశ్నించారు.
రైతులను మాయ చేస్తున్నరు: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
రుణమాఫీ పేరుతో రైతులను సీఎం మాయచేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా విమర్శించారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో మాట్లాడుతూ.. రైతులకు కేసీఆర్ హయాంలో ఏం జరగలేదన్నట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీకి విడుదల చేసింది రూ.6 వేల కోట్లు మాత్రమేనని ధ్వజమెత్తారు. ఆరు గ్యారెంటీలు, ౧౩ హామీలతోపాటు రుణమాఫీ ఆగస్టు 15లోగా అమలు చేస్తే రాజీనామా చేస్తా అని హరీశ్‌రావు సవాల్ విసిరారని, దానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు.