calender_icon.png 25 September, 2024 | 7:54 AM

సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్నారు

09-09-2024 12:44:37 AM

సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం

ముషీరాబాద్, సెస్టెంబర్ 8: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్ర పుటల్లో సవర్ణాక్షరాలతో లిఖించబడిందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను నాలుగు భాషలుగా ముద్రించి ప్రచురించిన బుక్లెట్‌ను ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి అధ్యక్షతన.. సురవరం సుధాకర్ రెడ్డి విడుదల చేశారు.

ముందుగా తెలంగాణ సాయుధ పోరాట సేనాని పద్మ విభూషణ్, మాజీ ఎంపీ రావి నారాయణ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాపీడకులైన దొరలు, దేశ్‌ముఖ్‌లకు మధ్య జరిగిన తెలంగాణ సాయు ధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ మతం రంగు అద్దుతున్న ఈ క్రమంలో తెలంగాణ సాయుధ పోరాట వాస్తవికత నేటి యువతరానికి తెలియజేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకట్‌రెడ్డి, జాతీయ సమితి సభ్యుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.