calender_icon.png 13 December, 2024 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టిని బుక్కుతున్నారు!

13-12-2024 12:10:35 AM

  1. అనుమతులు ఒకచోట.. తవ్వేది మరోచోట
  2. రాత్రుళ్లు పోసుడు.. పగలు నేర్పుడు
  3. మంచిర్యాల జిల్లాలో జోరుగా మొరం, మట్టి దందా
  4. చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

మంచిర్యాల, డిసెంబర్ 1౨ (విజయక్రాం  తి): మంచిర్యాల జిల్లాలో మొరం, మట్టి దందా జోరుగా సాగుతున్నది. అనుమతు లు ఒక చోట.. తవ్వేది మరో చోట. అక్రమార్కులు ప్రభుత్వ భూములు, చెరువులు, గుట్ట లు ఇలా ఎక్కడ పడితే అక్కడ అనుమతులు లేకుండానే టన్నుల కొద్ది మట్టిని తరలిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇంతా జరుగుతున్నా చర్యలు తీసుకోవాల్సిన అధికారు లు వారికి అండదండగా నిలవడంతో అక్రమార్కులు మట్టిని ఇష్టారీతిన అక్రమ రవాణా చేస్తున్నారు.

అనుమతి ఒకచోట.. తోడేది మరో చోట..

జిల్లాలో మట్టిని త్వవ్వేందుకు జైపూర్ మండలంలో మాత్రమే అనుమతులుండగా.. వ్యాపారులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ మట్టిని తవ్వుతున్నారు. హాజీపూర్, లక్షెట్టిపేట మండలా లతో పాటు దండేపల్లి మండలాల్లో ఈ వ్యాపారం రాత్రి, పగలు తేడా లేకుండా మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తున్నది. రాత్రంతా మట్టిని తీసుకొచ్చి ప్లాట్ల భూముల్లో పోస్తూ పగలంతా ఆ మట్టిని లెవలింగ్ చేస్తున్నారు.

ఈ తతంగమంతా జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్లాట్లల్లో జరుగుతున్నా సంబం ధిత రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవ హరిస్తున్నారు. మామూళ్లకు అలవాటు పడిన రవాణా శాఖ అధికారులు ఓవర్ లోడ్‌తో మట్టిని తరలిస్తున్న వాహనాలకు జరిమానా వేసిన సంద ర్భాలు లేవు. ఏడాదికి రెండు, మూడుసార్లు మచ్చుకు పది వాహనాలను పట్టుకొని ఫొటోలకు ఫోజులిస్తున్నారు. 

ప్రభుత్వ ఆదాయానికి గండి..

మట్టి దందా చేసే బ్రోకర్లంతా రాత్రి వేళ ప్రభుత్వ భూముల నుంచి ముందుగా ఆర్డర్ తీసుకున్న వారికి టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం మట్టిని తర లించాలంటే ప్రభుత్వానికి టన్నుకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే అక్రమ రవాణాకు తెరతీసిన వ్యాపారులు, అధికారులతో చేతులు కలిపి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ అక్రమ దందాపై దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నది. కనీసం జాతీయ రహదారి పక్కన వందల ట్రిప్పుల మొరం రాత్ల్రు పోసి లెవలింగ్ చేస్తున్నా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మట్టి బ్రోకర్లదే హవా..

జిల్లాలో మట్టి బ్రోకర్ల హవా బాగా నడుస్తున్నది. మైనింగ్, రెవెన్యూ, పోలీసు, రవాణా ఇలా అన్ని శాఖలను వారి గుప్పి ట్లో పెట్టుకొని పగలు, రాత్రి తేడా లేకుం డా మట్టి దందా సాగిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారులు, ఇంటి నిర్మాణాలు చేసేవారికి, గ్రామాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లకు ఇరువైపులా సైడ్ బర్మ్‌లుగా పోసేందుకు అక్రమార్కులు మట్టిని వక్రయిస్తూ రూ. లక్షల్లో గడిస్తున్నారు. కొంతమంది మట్టి బ్రోకర్లు ట్రాక్టర్లు, టిప్పర్లలో అనుమతి లేకుండానే మట్టిని తరలిస్తున్నా అధికారులు మామూళ్లు తీసుకుంటూ వదిలే స్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.