calender_icon.png 23 January, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగులకు అండగా ఉండేందుకే పోటీ చేస్తున్న.

22-01-2025 01:41:09 AM

రాయికల్ పట్టభద్రులతో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి

జగిత్యాల అర్బన్,  జనవరి 21 (విజయక్రాంతి): నిరుద్యోగులకు అండగా నిలిచి, వారి సమస్యలు పరిష్కరించేందుకే తాను పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నట్టు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్’రెడ్డి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్లో మంగళవారం పట్టభద్రులను కలిసి రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ, నిరుద్యోగ, పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఒక మంచి ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు వెల్లడించారు. నిరుద్యోగులకు అండగా ఉండి, ఉద్యోగ రూపకల్పనలో ఉంటాన్నారు.

ప్రైవేట్ విద్యాసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు చేదోడు - వాదోడుగా ఉంటూ వారికి ఉద్యోగ భద్రతతో పాటు హెల్త్ కార్డుల మంజూరుకి కృషి చేస్తానన్నారు.

తాను ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత వచ్చే వేతనాన్ని ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి నిరుపేద ఉపాధ్యాయులకు, నిరుద్యోగ పట్టబద్రుల సంక్షేమానికి వెచ్చిస్తానని వెల్లడించారు.. విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చిన తాను రాజకీయ రంగంలో కూడా నూతన ఒరవడి సృష్టిస్తానని వెల్లడించారు. రానున్న పట్టభద్రులు ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.