న్యూఢిల్లీ: హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో పెళ్లి రూమర్లపై టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ తీవ్రంగా స్పందించాడు. ఇలాంటి నిరాధార వార్తలు సృష్టించేవారికి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ‘ఇలాంటి అసత్య వార్తలు ప్రచారం చేసే వారికి నాదొక హెచ్చరిక. మీరు చేసే మీ మ్స్ వల్ల చాలామంది బాధపడతారు. ఇలాంటివి చేయడం వల్ల ఏం వస్తుంది. నేను ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఇవే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ బాద్యతా యుతంగా ప్రవర్తించాలి. తప్పుడు ప్రచా రం చేయాలనుకుంటే మీ అసలైన ఖాతా ల నుంచి పోస్టు చేయండి. అప్పుడు నేను సరైన సమాధానం ఇస్తా’ అని షమీ పేర్కొన్నాడు. కాగా.. ఈ అంశంపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా గతంలోనే స్పందించి ఇవన్నీ రూమర్స్ అని ఖండించిన విషయం తెలిసిందే.