calender_icon.png 23 December, 2024 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవన్నీ తప్పుడు ఆరోపణలే

14-09-2024 03:12:12 AM

తొలిసారి స్పందించిన సెబీ చీఫ్ మాధవి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందారని తనపై వచ్చిన ఆరోపణలను సెబీ చీఫ్ మధవీపురీ బచ్ తిరస్కరి ంచారు. ఈ ఆరోపణలపై తొలిసారిగా స్పందించిన ఆమె.. అవన్నీ తప్పని, దురుద్దేశాలతో కూడినవని స్పష్టం చేశారు. సెబీ నిబంధనలు, మార్గదర్శకాలకు కట్టుబడే తాను పనిచేశానని తన భర్త ధావల్ బచ్‌తో కలిసి ఉమ్మడి ప్రకటన చేశారు.

అదానీ గ్రూప్ సహా మరికొన్ని కార్పొరేట్ సంస్థల వ్యవహారాల్లో కావాలనే ఆమె నెమ్మదిగా దర్యాప్తు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఇందుకు బచ్ గతంలో ఆ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు, ఒప్పందాలే కారణమని హిండెన్‌బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ సైతం విమర్శలు ఎక్కుపెట్టింది. దర్యాప్తు చేస్తున్న కంపెనీల నుంచి ఆమె భర్త ధావల్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ ఆదాయం ఆర్జిస్తో ందని ఆరోపించింది. 

లోక్‌పాల్ మహువా ఫిర్యాదు

మాధవీపురిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ లోక్‌పాల్‌లో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఫిర్యాదు చేశారు. మాధవిపై వస్తున్న ఆరోపణలు దేశంలోని దాదాపు 10 కోట్ల మంది ప్రత్యక్ష లేదా పరోక్ష పెట్టుబడుదారులపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. 1988 చట్ట ప్రకారం ఆమెపై వెంటనే విచారణ చేయాలని కోరారు.