* చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, జనవరి13(విజయక్రాంతి): హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైకోలా.. పిచ్చికుక్కలా వ్యవహరిస్తున్నా రన్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, సైకో..పిచ్చి కుక్కను ఎగదోసి ఫైశాచిక అనందం పొందుతున్నారన్నారు. పార్టీల పిరాయింపులను ప్రోత్సహించిన నీచ సంస్క తి బిఆర్‌ఎస్ దాని అన్నారు.
సైకోనా కొడు కులను కంట్రోల్ చేయకపోతే వీపు పగల గొట్టక తప్పదని హెచ్చరించారు. కేసిఆర్, కేటిఆర్, హరీష్‌రావులను ఎక్కడ తిరగని వ్వమని అడ్డుకుంటామన్నారు. ఇంతకాలం ఓపిక పట్టామని, ఒక్క క్షణం ఆలోచిస్తే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేవు అన్నా రు. కౌశిక్ రెడ్డి పై డిజిపి, కరీంనగర్ సిపి కి పిర్యాదు చేస్తామన్నారు.
కౌశిక్‌రెడ్డి వెనుక ఉండి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టమ వుతుంది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేంద ర్‌రెడ్డి కౌశిక్‌రెడ్డి పదే పదే మంత్రులపై ఎమ్మె ల్యేలపై దాడి చేయడం చూస్తే వెనకాల ఉండి ప్రతిపక్షనాయకుడు కేసిఆర్ ప్రోత్సహిస్తు న్నట్టు స్పష్టంగా అనుమానం కలుగుతోం దని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.నిన్న కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై కౌశిక్ రెడ్డి దాడి పథకం ప్రకారమే జరిగిందని అన్నారు.
పేదలను, రైతులను, అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం ఆదుకుంటుంటే ఓర్వలేక వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని అన్నారు.ఇటువంటి దాడులను ఇప్పటికైనా ఆపాలం టే దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న కౌశిక్ రెడ్డి తో పాటు దాడులను పరోక్షంగా ప్రోత్సహి స్తున్న కేసిఆర్ పై కూడా కేసు నమోదు చేయాల్సిందిగా టౌన్ ఏసిపి వెంకటస్వామికి ఫిర్యాదు చేశామన్నారు. -
కౌశిక్‌రెడ్డి తీరు మార్చుకో: మాజీ ఎంఎల్‌ఏ ఆరెపల్లి మోహన్
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో జరిగిన అభివద్ధిపై సమీక్ష సమావేశం జరు గుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి ప్రవర్తిం చిన తీరు, ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తు న్నామని, ఈ సంఘటన చాలా బాధాకరం అన్నారు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ అన్నారు. సమావేశంలో జగిత్యాల శాసనస భ్యులు సంజయ్ కుమార్ మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి చేసిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
కౌశిక్‌రెడ్డి శాసనస భ్యుడు అయి ఉండి తోటి శాసనసభ్యుడైన సంజయ్ కుమారును అడ్డుకొని దాడి చేయడం బాధాకరమన్నారు. వీధి రౌడీల ప్రవర్తిస్తున్న కౌశిక్ రెడ్డిని శాసన సభ్యుడి హక్కులకు భంగం కలిగించినందుకు శాసన సభ్యుడి పదవి నుండి భర్త రఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.
నేను కూడా గతంలో శాసనసభ్యుడిగా పనిచేశా నని, కానీ ఇలాంటి సంఘటనలు ఎన్నడు చూడలేదని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక శాసన సభ్యుడిగా ఉండి తోటి శాసనసభ్యు డుపై దాడి చేయడం సిగ్గుచేటని, కాంగ్రెస్ కార్యకర్తలు సంయనం పాటించాలని మం త్రులు పోన్నం ప్రభాకర్ , దుద్దిల్ల శ్రీధర్ బాబు చెప్పడం వల్లే నిన్నటి రోజు కౌశిక్ రెడ్డి క్షేమంగా ఇంటికి వెళ్ళాడు, లేకపోతే కౌశిక్‌రెడ్డి హుజురాబాద్‌కు వెళ్లేవాడు కాద న్నారు. కౌశిక్ రెడ్డి నీ ప్రవర్తన మానుకో నీ నాయకుల మెప్పు కోసం ఇలాంటి దుందు డుకు చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి హెచ్చరించారు.