calender_icon.png 18 November, 2024 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ చెట్లు యమ డేంజర్

18-11-2024 03:50:25 AM

సిద్దిపేటలో విచ్చలవిడిగా కోనోకార్పస్ చెట్లు

వీటి పుప్పొడి పీలిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటున్న వైద్యులు

ప్రమాదకరమని తెలిసినా పట్టించుకోని మున్సిపల్ అధికారులు

సిద్దిపేట, నవంబర్ 17 (విజయక్రాంతి)ప్రజలు నివాసముండే ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించి ప్రాణవాయువును విడుదల చేసే మొక్కలను నాటాలి. కానీ అధికారుల అవగాహనరాహిత్యం వల్ల సిద్దిపేట జిల్లాకేంద్రంలోని ప్రధాన రోడ్లతో పాటు వీధులగుండా విరివిగా కోనోకార్పస్ మొక్కలు (ఏడాకుల మొక్కలు) నాటారు. ప్రస్తుతం ఇవి ఏపుగా పెరిగి పువ్వులు పూస్తున్నాయి. వీటి పుప్పొడి వల్ల అలర్జీ, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే కోనోకార్పస్ చెట్లను తొలగించాలని స్థానికులు అనేకసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.