09-04-2025 01:50:06 AM
గతేడాది 7.2 శాతం అధిక వృద్ధితో రూ.75,149 కోట్ల వసూళ్లు
ప్రకటన విడుదల చేసి వాణిజ్య పన్నుల శాఖ
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): తెలంగాణలో ఆదాయం గణనీయంగా పడిపోయిందని, జీఎస్టీ వసూళ్లు తగ్గాయని ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలతో కూడిన ప్రకటనను మంగళవారం విడుదల చేసింది. గతేడాది 7.2 శాతం వృద్ధిని సాధించినట్టు అందులో తెలిపింది.
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పక్కా ప్రణాళికలు, సమర్థవంతమైన వ్యవహరంతో ఆదా య వృద్ధిరేటు పెరుగుతోందని అధికారులు తెలిపారు. 2025 ఏడాదికి గానూ రూ. 89,368 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. గడిచిన ఏడాది 2024 25లో గణనీయమైన ఆర్ధిక వృద్ధి సాధించామని వెల్లడించారు. దానిలో భాగంగానే ఆ ఏడాది ఆదాయ వసూళ్లు రూ. 75,149 కోట్లకు చేరినట్టు వివరించారు.
ఇది అంతకుముందు గతే డాదితో పోలిస్తే 7.2 శాతం వృద్ధితో రూ.4,428 కోట్ల అధికాదా యం ప్రభుత్వానికి సమకూరినట్టు తెలిపారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేం దుకు, ఆదాయాన్ని మెరుగుపర్చుకునేందుకు అనేక విధానాలను అవలంబించినట్టు పేర్కొన్నారు. ‘జీఎస్టీ వసూళ్లపై ప్రధానంగా దృష్టి సారించాం. దీంతో పాటు డిమాం డ్ల రికవరీ విధానాలను బలోపేతం చేశాం.
పన్ను చెల్లింపుల్లో మెరుగైన కంప్లయన్స్ సాధ న, ఫేక్ రిజిష్ర్టేషన్లను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిండం వంటి చర్య లు తీసుకున్నాం. ఈ ఫేక్ రిజష్ర్టేషన్ల నియంత్రణకు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాం’ అని వెల్లడించారు. ప్రధానంగా ఆదాయ పతనాన్ని అరికట్టేందుకు చిత్తశుద్ధితో పనిచేసినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో పాటు నూతన సంస్కరణలు కూడా వృద్ధి రేటును పెంచేందుకు ఉపయోగపడ్డాయన్నారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జీఎస్టీ వసూళ్లలో దేశంలో మంచి ట్రాక్ రికార్డును సంపాదించింది. వృద్ధి రేటు పెంచేందుకు ఆర్థిక క్రమశి క్షణతో వ్యవహరిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సంవత్సరాల వారీగా వృద్ధి రేట్లను పరిశీలిస్తే 2022 ఏడాదిలో ఆదా య వసూళ్లు రూ.70,636 కోట్లు వచ్చా యి. 2023 వసూళ్లు స్వల్పంగా పెరిగి ఆర్థికాదాయం రూ.70,721 కోట్లకు చేరింది.