calender_icon.png 15 November, 2024 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ మ్యాగజీన్లు మనకోసమే!

20-07-2024 12:00:00 AM

హాయ్ ఫ్రెండ్స్.. ఈ వారం మీకు ఓ మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడూ ఫోన్, టీవీ.. ఆటలేనా? కాసేపు సరదాగా.. ఓసారి ఈ ప్రపంచాన్ని చుట్టేసి వచ్చేద్దామా? అదేంటి అదేలా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఇంట్లోనే.. ఉన్నచోటే.. ఈ ప్రపంచంలోని వింతలు, విశేషాలు తెలుసుకోవచ్చు? దాని కోసమే ప్రత్యేకంగా కొన్ని మ్యాగజీన్లు ఉన్నాయి తెలుసా? అవి కేవలం మన కోసమే!. చాలా అద్భుతంగా, రంగురంగుల ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. వాటిని చదివితే ఎన్నో కొత్త విషయాలు, ప్రకృతి రహస్యాలు, జంతువులు, జలచరాలు, దెయ్యాలు, భుతాలు, దేవతలు, దేవుళ్లు, హిస్టరీ, డిస్కవరీ, సూపర్ మ్యాన్ కథలు, అల్లా వుద్దీన్ అద్భుత దీపం, డైనోసార్స్, పజిల్స్, కర్టూన్స్, క్విజ్.. ఇలా మనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకొని చదువుకుంటే జ్ఞానాన్నే కాదు, వినోదాన్ని కూడా ఆస్వాదిస్తారు. మరెందుకు ఆలస్యం.. మన కోసమే ప్రత్యేకంగా రూపొందించిన మ్యాగజీన్ల గురించి తెలుసుకుందాం పదండి..!

నేషనల్ జియోగ్రాఫిక్ కిడ్స్

(National Geographic Kids)

ప్రపంచంలోనే అత్యధికంగా పిల్లలు ఇష్టపడే మ్యాగజీన్ ఇది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల అవుతుంది. సంవత్సరానికి పది సంచికలు మాత్రమే ప్రచురి స్తుంది. దీంట్లో అద్భుతమైన జంతువులు, ఫన్ స్టఫ్, వరల్డ్ న్యూస్, జస్ట్ జోకింగ్, స్టుపిడ్ క్రిమినల్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, వైల్డ్ లైఫ్, స్పోర్ట్స్ ఫన్నీస్, క్విజ్ విజ్.. ఇలా అనేక అంశా లు ఈ మ్యాగజీన్‌లో ఉంటాయి. ఇది పిల్లలను ఒక ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

టెల్ మీ వై (Tell me why)

టెల్ మీ వై.. అనేది ఇంగ్లీషు మాస పత్రిక. ఈ మ్యాగజీన్ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో ముఖ్యంగా స్కూల్లో ప్రాజెక్ట్‌లు, అసైన్‌మెంట్‌లు ఎలా చేయాలో వివరంగా ఉంటుంది. 

రాబిన్ ఏజ్ (RobinAge)

ఈ మ్యాగజీన్ 7 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. దీంట్లో ప్రముఖల గురించి, అవార్డు గ్రహీతలు, విజేతలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఈ మ్యాగజీన్ పిల్లలకు అర్థమయ్యే భాషలో.. స్పష్టంగా, ఆకర్షణీయంగా ఆర్టికల్స్ ఉంటాయి. ఒక్కసారి పిల్లలు చదివితే.. వదిలిపెట్టకుండా చదువుతారు. రాబిజ్ ఏజ్‌లో పజిల్స్, యాక్టివిటీలు, ప్రాజెక్ట్స్, కరెంట్ అఫైర్స్, సైన్స్, హిస్టరీ, స్టోర్ట్స్, కెరీర్, సంస్కృతి, గణితం, ఇంగ్లీష్, పర్యావరణానికి సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుంది. 

హైలెట్స్ జెనీస్ 

(Highlights GENIES)

ఇది 2 సంవత్సరాల చిన్నారులకు సంబంధించిన మ్యాగజీన్. ఇది చిన్నారులను ఏకాగ్రతగా ఒక యాక్టివిటీ వైపు ఆలోచించేలా చేస్తుంది. అదే విధం గా స్కూల్లో వారికి అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఈ మ్యాగజీన్ రంగు రంగు బొమ్మలతో చిన్నారులకు అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని అందిస్తుంది. 

హైలెట్స్ చాంప్స్ 

(Highlights CHAMP)

ఈ మ్యాగజీన్ 6 సంవత్సరాల పిల్లల కోసం రూపొందించారు. ప్రతి సంచికలో పిల్లలు కొత్త కొత్త అంశాలను అన్వేషిస్తారు. మంచి విషయాలను పరిశోధిస్తారు. కథలు, గేమ్‌లు, పజిల్స్, జోకులు, ప్రయోగాలు, సైన్స్, క్రాఫ్ట్ ప్రాజెక్ట్స్ అనే అంశాలు ఉంటా యి. ఇవి పిల్లలను వినోదత్మాకమైన ప్రపంచం లోకి తీసుకెళ్తుతాయి. 

చంపక్ (Champak)

చంపక్ మ్యాగజీన్ భారతదేశంలో అత్యధికంగా పిల్లలు చదివే పత్రిక. ఇది ఎనిమిది భాషలలో ప్రచురించబడుతుంది. ఈ మ్యాగ జీన్ జంతు పాత్రలపై మనోహరమైన కథలకు ప్రసిద్ధి చెందింది. కథలను ఒక్కసారి చదివితే జీవితాంతం మరిచిపోకుండా గుర్తు ఉంచుకుంటారు. 

బలరామ (Balarama)

ఈ మ్యాగజీన్ లోని అంశాలను పిల్లలు ఆసక్తిగా చదువుతారు. ఇది ప్రత్యేకంగా 6 సంవత్సరాల చిన్నారుల కోసం తయా రు చేయబడిన మ్యాగజీన్. దీంట్లోని కథాంశాలు అన్నీ చాలా వినోదాత్మకంగా ఉంటా యి. హాస్య చిత్ర కథలు, డిస్నీ, మార్వెల్ వంటి ప్రముఖ అంతర్జాతీయ కామిక్స్ బలరామ మ్యాగజైన్‌లో చూడొచ్చు. సైన్స్ ఆవిష్కరణలు, వాస్తవాలు, రహస్యాల నుంచి విభిన్న అంశాలకు సంబంధించిన కథనాలు చిన్నారులను ఆకర్షిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్లాసిక్ జానపద కథలకు ప్రాచుర్యం పొందింది. 

రీడ్ అండ్ కలర్ 

(Read and Colour)

ఇది మూడు నుంచి తొమ్మిదేళ్ల చిన్నారుల కోసం తయారు చేసిన మ్యాగజీన్. ఈ మ్యాగజీన్ ద్వారా పిల్లలు చదవడం, రంగులు వేయడం నేర్చుకుంటారు. దీంట్లోని అంశాలు చిన్నారులను వేరే ప్రపంచంలోకి నడిపిస్తాయి. 

చైల్డ్ ఫ్రెండ్లీ న్యూస్ మ్యాగజీన్ (CFN)

ఈ మ్యాగజీన్‌లో పిల్లలకు అర్థమయ్యే వార్తలు ఉంటాయి. దీంట్లో డిజిటల్ ఎడిషన్, ట్రెడ్ మార్క్ వార్తలు, ఫీచర్లు, సాంకేతికతపై ప్రత్యేక కథనాలు ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు న్యూస్ పేపర్ చదివేలా ప్రోత్సహిస్తోంది. ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ వార్తలు మ్యాగజీన్‌లో సులభంగా, అర్థమయ్యే విధంగా ఉంటాయి.

మ్యాజిక్ పాట్

(Magic Pot)

మ్యాజిక్ పాట్ అనేది ఇంగ్లీష్ వార పత్రిక. ఇది కేవలం చిన్నారుల కోసమే రూపొందించింది. మ్యాజిక్ పాట్ మ్యాగజీన్‌లో చిన్నారులకు సంబంధించిన పనులు ఎలా చేసుకోవాలి. ఆటలు, పెయింటింగ్, కలరింగ్ వంటి సృజనాత్మక అంశాలు ఉంటా యి. ఆల్బమ్స్, ప్రాజెక్టు పనులు ఎలా చేయాలి. అలాగే కథలు, కవితలు, కామిక్స్ ఈ మ్యాగజీన్‌లో ఉంటాయి. ఇది చిన్నారుల జ్ఞానాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.

బాల చెలిమి 

(Bala Chelimi)

ఇది పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మాసపత్రిక. పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మ లు, కథల పుస్తకాలే. పాఠ్యపుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. పుస్తకాలు పిల్లల  ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. బాల చెలిమి సంచికలో చరిత్ర, సంస్కృతి, కళలు, సైన్స్, మానవ స్వభావాలు, జంతు స్వభావాలు, ఆరోగ్య సంబంధిత అంశాలు ఉంటాయి.