calender_icon.png 24 April, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ భూములు మావే!

24-04-2025 12:20:34 AM

  1. పట్టాలు ఉంటే ఇన్నాళ్లూ ఎక్కడ పోయారు?
  2. మా దగ్గరా పాస్ బుక్కులు ఉన్నాయి
  3. దౌర్జన్యం సహించబోము..మా భూములు వదలం
  4. విజయక్రాంతి ని సంప్రదించిన హన్వాడ మండల వారసత్వ పట్టా లబ్ధిదారులు

మహబూబ్ నగర్ ఏప్రిల్ 22 (విజయ క్రాంతి) : హన్వాడ మండల పరిధిలో అమ్మపూర్ మాదారం శివారులోని సర్వేనెంబర్ 72,73లో గల ఓ భూమి వివాదం ఆశ్చర్యానికి గురి చేసేలా ఉంది. పట్టాదారుల తాత ముత్తాతల నుంచి వారి సమాధులు, కొట్టా లు, కోళ్ల ఫారాలు, ఇలా ఒక్కటేంటి వారికి సంబంధించిన భూమే కదా అనుకుంటూ వారి ఇష్టానుసారంగా సాగు చేసుకున్నారు..

పంట పండించుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. ఉన్నట్టుండి వారితో పాటు వారి భవిష్యత్తు తరాలు జీర్ణించుకోలేని సౌండ్ వినిపించింది.. మీ దగ్గర కొత్త పాస్ పుస్తకం లేదు ఈ భూములు మావి మా పేరు పైన కొత్త పాస్ పుస్తకం వచ్చింది.. ఒక్కసారిగా ఈ విషయాన్ని తెలుసుకున్న వారు ఉలిక్కిపడ్డారు. 

ముమ్మాటికి అక్రమ పట్టే అంటున్న రైతులు..

మా తాత వారి నాన్న కాలం నుంచి కూడా వారసత్వంగా మాకు ఈ భూమి ఉందని, కొత్త పాస్ పుస్తకం తీసుకువచ్చి ఈ భూములు అన్ని మావే మీరు వెళ్లిపోండి అంటే ఎట్లా వెళ్ళిపోతామంటూ అమ్మ పూర్, మాదారం గ్రామల శివారులో ఉన్న సర్వే నెంబర్లు 72,73 లోగల భూమి పట్టాదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 40 కుటుంబాలు ఈ భూమిలో వారి కుటుంబ పరిధిని బట్టి వచ్చిన భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

ఏండ్ల తరబడి మోకాలో ఉన్న తమని సంప్రదించకుండా రెవెన్యూ అధికారులు ఈ భూమిని ఇతరులకు ఎలా పట్టా చేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా పోయిందేంలేదని వారు కాగితాలు పట్టుకొని వస్తే భూమి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోమని, సమగ్ర విచారణ చేసి మాకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. 

ఇటీవల ధర్నా...

హన్వాడ మండలం పరిధిలో వివాదాస్పదంగా మారిన ఈ భూమికి సంబంధించి మండల బిఆర్‌ఎస్ నేతలు ఆ భూములను ప్రత్యేకంగా ఇటీవల పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు అక్రమంగా పట్టా చేసుకొని భూములు మా వంతు పేదలను ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే రైతులకు న్యాయం చేయాలని వారికి పూర్తి హక్కు పట్టణ ఇవ్వాలని, అక్రమంగా పట్టా పొందిన వారి పట్టాను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు పట్టా చేసుకొని రైతులను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములను పరిశీలించే రైతులకు అండగా ఉంటామని బిఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు డిపి లక్ష్మయ్య జెడ్పిటిసి నరేందర్ మాజీ ఎంపీటీసీలు చెన్నయ్య, నాగన్న, ఆంజనేయులు నాయకులు జంబులయ్య, శ్రీనివాసులు, అనంతరెడ్డి,రా మలింగం, ఆంజనేయులు, కరుణాకర్ గౌడ్, తిరుమల్ రెడ్డి, మాధవులు, పేర్కొన్నారు.

అధికారులే న్యాయం చేయాలి..

సాదా బైనమాతో పాటు పలుమార్లు ప్రభుత్వానికి మేము విన్నపాలు పెట్టుకున్నాం. మాకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. వారు ఎప్పుడూ స్పందించలేదు. మా తాతలు చనిపోయిన కూడా వారి సమాధులను కూడా ఇక్కడే పెట్టాం. మాకు పూర్తిగా జీవనోపాధి ఈ భూమి. పట్టలేదు ? కాగితం లేదు ? అంటూ వస్తే ? భూములు ఇస్తారా ? జరా ఆలోచన చేయాలి. మా భూమి మాకే సొంతం. అధికారులు మాకు న్యాయం చేయాలి. 

 భాగ్యమ్మ, రైతు, 


ఇదెక్కడి న్యాయం..

మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ భూముల్లో పంటలను సాగు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు సంబంధిం చిన పాత పాస్ పుస్తకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. కొత్త పాస్ పుస్తకాల కోసం అధికారుల చుట్టూ ఎన్నో మార్లు ప్రదక్షిణలు చేశాం. కాగా వారు ఇవ్వలేదు.

ఇప్పుడు ఒకరు వచ్చి ఈ భూమి మా పేరుపై ఉంది మీరు వెళ్ళండి అంటే ఎట్లా. ఏం ల తరబడి మోకాలు మేమున్న ఓ పుస్తకం పట్టుకుని వస్తే వారికి ఇవ్వాలా ? ఇదెక్కటి న్యాయం. అధికారులు పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేసి వారికి ఇచ్చిన పట్టాను రద్దుచేసి మాకు న్యాయం చేయాలి. 

బాలకృష్ణయ్య, రైతు, -