22-04-2025 01:56:41 AM
వారిలో 13మంది విద్యార్థులు
ఇద్దరు అమ్మకందారుల అరెస్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం, పోలీసులు కృషి చేస్తుంటే అక్రమార్కులు రూటు మార్చి మత్తు పదార్థాల దందాకు పాల్పడుతున్నారు. సోమవారం నగరంలో ఈ కలకలం రేగింది. పలు విద్యాసంస్థల వద్ద ఈ వేప్స్‌ను విక్రయిస్తున్న ముఠా సభ్యులను టీజీఎన్‌ఏబీ, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారులు, యువతే లక్ష్యంగా ఈ ముఠా సభ్యులు ఈ సిగరెట్స్, వేప్స్‌ను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎస్‌ఐడీ అనే వాట్సప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి దాదాపు 500మందికి పైగా ఈఱూ వైప్స్ ఇతర మత్తు పదార్థాలను విక్రయించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కొన్నివారిలో నగరంలోని పలు స్కూళ్లు, కాలేజీలకు చెందిన 13 మంది విద్యార్థులున్నట్లు తెలుస్తోంది.
నాంపల్లికి చెందిన సాదిక్ లలాని, అనిల్ లలాని అనే సోదరులు అమ్మకందారుల ముఠాలో సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన అమిత్, ముంబైకి చెందిన వసీం అనే వ్యక్తుల నుంచి హైదరాబాద్‌కు నిందితులు డ్రగ్స్‌ను తీసుకువస్తున్నట్లు గుర్తించారు. రాపిడో, ఊబర్, డీటీడీసీ ద్వారా మత్తు పదార్థాలను డెలివరీ చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడ్డట్లు తెలుస్తోంది.
కాగా ఈ ముఠా నుంచి 7కార్టన్‌లలో 1,217 పీస్‌లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.25లక్షలు ఉంటుందని నిర్ధారించారు. అలాగే 225 అమెరికన్ డాలర్లు, 100 కెనడియన్ డాలర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఈ రకరకాల ఫ్లేవర్లతో కూడిన నికొటిన్, ఇతర రసాయనాలను ఉపయోగిస్తారు. వీటిని వినియోగించే వారికి నికొటిన్, రసాయనాలు పొగలా మారి ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. డీఎన్‌ఏ, మెదడు పనితీరు దెబ్బతింటుందని వైద్యనిఫుణులు హెచ్చరిస్తున్నారు.