calender_icon.png 17 November, 2024 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాప్ 10 ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్ ఇవే!

17-11-2024 12:00:00 AM

మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేసేవారు సాధారణంగా ఆయా స్కీమ్‌లు గతంలో ఇచ్చిన రాబడుల్ని పరిశీలించడం పరిపాటి. వాస్తవానికి గత రాబడులు భవిష్యత్ లాభాలకు గ్యారంటీ కాదుగానీ, ఆయా ఫండ్స్ పనితీరును తెలుసుకునే సంకేతమే. మార్కెట్‌తో పోలిస్తే ఆయా స్కీమ్‌లు భవిష్యత్ రాబడులు ఎలా ఉండవచ్చో అంచనా వేసుకోవచ్చు. 

ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్స్ అంటే..

మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఆఫర్ చేసే ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్‌లు వాటివద్దనున్న నిధుల్లో కనీసం 65 శాతం ఈక్విటీ, ఈక్విటీ సంబం ధిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈక్విటీకి కేటాయించిన నిధులను ఇవి స్టాక్ మార్కెట్లో ఎటువంటి మార్కెట్ విలువ కలిగిన షేర్ల లోనైనా (లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్)  పెట్టుబడి చేస్తాయి. లార్జ్‌క్యాప్‌లో ఇంత, స్మాల్‌క్యాప్‌లో ఇంత ఇన్వెస్ట్ చేయాలన్న ని యమమేమీ లేదు.

వివిధ రంగాలకు చెందిన స్టాక్స్‌లో పెట్టుబడి చేస్తాయి. సమయాను గుణంగా ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను స్వేచ్ఛగా లార్జ్‌క్యాప్స్ నుంచి మిడ్‌క్యాప్స్‌లోకి, మిడ్, స్మాల్ క్యాప్స్ నుంచి లార్జ్‌క్యాప్‌లోకి మార్చుకునే స్వేచ్ఛ ఉంటుంది. అలాగే ఒక రంగం స్టాక్స్ నుంచి విక్రయించి, మరో రంగం షేర్లలోకి పెట్టుబడుల్ని షిఫ్ట్ చేస్తారు. 

39 ఫ్లెక్సీ స్కీమ్‌లు

దేశంలో ప్రస్తుతం 39 ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్‌ల్ని వివిధ ఫండ్ హౌస్‌లు నిర్వహిస్తున్నాయి. అ సోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ (యాంఫి) తాజా గణాంకాల ప్రకారం అక్టోబ ర్ నెలలో ఫ్లెక్సీక్యాప్ స్కీమ్‌ల్లోకి రూ.5,180 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వివిధ ఫండ్ హౌస్‌లు నిర్వహిస్తున్న ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్‌ల్లో వాటి ఆస్తుల పరిమాణం ప్రకారం పరాగ్ ఫరేఖ్ ఫ్లెక్సి క్యాప్ ఫండ్ రూ.82,567 కోట్ల ఆస్తులతో ప్రధమస్థానం లో ఉన్నది. హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రూ.64,221 కోట్ల ఆస్తులతో ద్వితీయస్థానం లో ఉన్నది. బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వ హిస్తున్న రూ.1,897 కోట్ల ఆస్తుల పరిమాణం అన్నింటికంటే తక్కువ. 

మూడేండ్లలో 15 శాతం చొప్పున వార్షిక రాబడి

దేశంలో వివిధ ఫండ్ హౌస్‌లు నిర్వహిస్తున్న దాదాపు 10 ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్‌లు గత మూడేండ్లలో చక్రగతిన 15 శాతం చొప్పున వార్షిక రాబడుల్ని అందించాయి. అన్నింటికంటే అధికంగా జేఎం ఫ్లెక్సీ క్యాప్ మూడేండ్లలో 22.81 శాతం వార్షిక లాభాలను తెచ్చిపెట్టగా, హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్ 21.58 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 19.31 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 17.23 శాతం చొప్పున రిటర్న్‌లు అందించాయి.