- 8 బడ్జెట్ ప్రసంగాలు.. 8 రంగుల చీరలు
- భారత వస్త్ర కళా వారసత్వాన్ని ప్రపంచానికి చాటేందుకే ధరింపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోనే కాదు చీర కట్టు, ఎంపికలోనూ అంతే హుందాతనం ప్రదర్శిస్తుంటారు. ప్రతీ బడ్జెట్‌కు ఓ ప్రత్యేకమైన చీర ధరించి దాని ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటుతుంటారు. ఆమె ఇప్పటి వరకు 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా 8 ప్రత్యేక చీరలు ధరించడం విశేషం. చీర ధరించడమే కాదు దానికి తగ్గట్టుగా అలంకరణ సైతం చేసుకుంటారు. 8 బడ్జెట్ ప్రసంగాల్లో నిర్మలమ్మ ధరించిన చీరల గురించి తెలుసుకుందాం.
2025: సంప్రదాయ బంగారు బోర్డర్‌తో అందమైన క్రీమ్ రంగు చీర. దానికి అపొజిట్ కలర్ అయిన ఎరుపు రంగు జాకెట్ ధరించారు. ఈ చీర మధుబని ఆర్ట్‌కు సంబంధించినది. ఇది బీహార్‌లోని మిథిలా ప్రాంతంలో తయారవుతుంది. ఈచీరను పద్మశ్రీ గ్రహీత దులారీ దేవి డిజైన్ చేశారు.
202౪: అందమైన తెల్లని మంగళగిరి చీర ధరించారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన మంగళగిరి చీర దాని సరళతకు, చక్కని అంచులకు, కళాత్మకతకు ప్రసిద్ధి.
2024(తాత్కాలిక బడ్జెట్): కాంతా చీరలో కనిపించారు. ఆకులు, పూల సంప్రదాయ నమూనాలతో బెంగాలీ కళా నైపుణ్యాన్ని అందంగా ప్రదర్శించింది.
202౩: ముదురు ఎరుపు రంగు పట్టుచీర, నలుపు బంగారు రంగుల ఆలయ అంచుతో చీర అందరినీ ఆకర్షించింది. నెమళ్లు, రథాలు, తామరపువ్వులతో చీర అందంగా ఉంది.
202౨: ఒడిశా నుంచి అందమైన గోధుమ రంగు బొంకాయ్ చీరను ధరించారు. సున్నితమైన వెండి జరీ పని, అంచు వెంట వివరణాత్మక నమూనాలు ఉన్నాయి.
202౧: తెలంగాణ పోచంపల్లి చేనేత ఇక్కత్ చీర. ఎరుపు, తెలుపు రంగుల కలయిక, ఆకుపచ్చ అంచుతో అందంగా ఉంది.
202౦: ఆశాజనకమైన పసుపు పట్టుచీర, నీలి అంచుతో ధరించారు. ఇది కష్టకాలంలో ఆశ, ఆర్థిక వృద్ధిని సూచిస్తుంది.
20౧౯: గులాబీ రంగు మంగళగిరి చీర, బంగారు అంచుతో ధరించారు. ముదురు రంగు ఆమె వినూత్న విధానాన్ని సూచిస్తుండగా..బంగారు అంచు దేశ గొప్ప వారసత్వానికి ప్రతీక.