calender_icon.png 26 December, 2024 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పా శాటిలైట్స్ ఇవే..

22-12-2024 01:46:35 AM

* విజయవంతమైతే ఆ దేశాల సరసన భారత్ 

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఇస్రో త్వరలో ప్రయోగించనున్న పీఎస్‌ఎల్వీ సీ60 ప్రయోగానికి సంబంధించిన శాటిలైట్ల నమూనా చిత్రాలను విడుదల చేసింది. ఈ శాటిలైట్లను సీ మిషన్ ద్వారా నింగిలోకి పంపనున్నారు. డాకింగ్ టెక్నాలజీ ద్వారా భారత్ చేసే మొదటి అంతరిక్ష యాత్ర ఇదే కావడం గమనార్హం. ఈ ప్రయోగం ద్వారా 400 కేజీల బరువు కలిగిన రెండు జంట ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. స్పా ఉపగ్రహాల తయారీలో ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని విడింది. ఈ రెండు ఉపగ్రహాల్లో ఒకదానికి చేజర్, మరోదానికి టార్గెట్ అనే పేర్లు పెట్టారు. మానవసహిత యాత్రకు సంబంధించి ఈ ప్రయోగం ఎంతో కీలకం. ఈ ప్రయోగం కనుక విజయవంతమైతే భారత్ యూఎస్, రష్యా, చైనాల సరసన చేరనుంది.