హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): వచ్చే ఏడాదిలో కోర్టులకు ఇచ్చే సాధారణ, ఆప్షనల్ సెలవుల తేదీలను హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 16, 17 తేదీలు, వేసవికాలానికి సంబంధించి మే 5 నుంచి జూన్ 6 వరకు సెలవులను ప్రకటించింది. దసరా పండుగకు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు ప్రకటించింది.
ఇక సాధారణ సెలవుల్లో భాగంగా.. జనవరి..1 (కొత్త సంవత్సరం), 13, 14, 15 తేదీల్లో సంక్రాంతికి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి, మార్చిలో 14న హోలీ, 31న రంజాన్, ఏప్రిల్ 5న జగ్జీవన్‌రామ్ జయంతి, 14న అంబేద్కర్ జయంతి, 18న గుడ్‌ఫ్రైడేకు సెలవులు ఉన్నాయి. జూన్ 7న బక్రీద్, జూలై 21న బోనాలు, ఆగస్టు 8న వరలక్ష్మీవ్రతం, 15న స్వాతంత్య్ర దినోత్సవం, 16న కృష్ణాష్టమి, 27న వినాయక చవితి, సెప్టెంబర్ 5న ఈద్ మిలాదున్ నబీ, 30న దుర్గాష్టమి, అక్టోబర్ 1న మహా నవమి, 2న గాంధీ జయంతి, 20న నరక చతుర్దశి, 21న దీపావళి, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 25, 26 తేదీల్లో క్రిస్మస్ సందర్భంగా సెలవులను ప్రకటించింది.
ఇక అకేషన్ ఫెస్టివల్ సందర్భంగా జనవరి 26న రిపబ్లిక్‌డే , మార్చి 30న ఉగాది, ఏప్రిల్ 6న శ్రీరామ నవమి, జూలై 7న మోహర్రం, సెప్టెంబర్ 21న బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా సెలవులను వాడుకునే అవకాశం కల్పించింది.