calender_icon.png 25 December, 2024 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా మంత్రులు వీరే..

22-12-2024 01:53:24 AM

మహాయుతి 2.0 క్యాబినేట్

ముంబై, డిసెంబర్ ౨౧: మహారాష్ట్ర కొత్త మంత్రివర్గ జాబితాను ప్రకటించారు. ఎన్నో రోజుల ఎదురుచూపులకు తెరదించుతూ శనివారం రోజు మంత్రి వర్గ జాబితాను వెల్లడించారు. 42 మంది మంత్రులతో కూడిన జాబితాను ప్రకటించారు. మహా ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వద్ద హోం మినిస్ట్రీ ఉండడం గమనార్హం. ఇక డిప్యూటీలు షిండేకు పట్టణాభివృద్ధి శాఖ, గృహనిర్మాణ శాఖ, పబ్లిక్ వర్క్స్ కేటాయించగా.. మరో డిప్యూటీ అజిత్ పవార్‌కు ఆర్థిక మంత్రిత్వ శాఖతో పాటు ప్లానింగ్ డిపార్ట్‌మెంట్లను కూడా కేటాయించారు.

సీఎం, డిప్యూటీలు డిసెంబర్ 5న ప్రమాణ స్వీకారం చేయగా.. మరో 39 మంది మంత్రులు డిసెంబర్ 15న ప్రమాణ స్వీకారం చేశారు. వాటర్ రిసోర్సెస్ మంత్రిత్వ శాఖ రాధాకృష్ణకు, మెడికల్ ఎడ్యుకేషన్ హసన్ సకినకు, హయ్యర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చంద్రకాంత్‌కు, అటవీ శాఖను గణేష్ సుభద్రకు, నీటి పారుదల శాఖ గులాబ్ రావుకు,  ప్రాథమిక విద్య దడాజీ రేష్మాభాయ్‌కి, సాయిల్ అండ్ వాటర్ కన్జర్వేషన్ సంజయ్ ప్రమీలా, ఫుడ్ అండ్ సివిల్ సప్లుసై అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ధనుంజయ్ రుక్మిణి, స్కిల్ డెవలప్‌మెంట్ మంగళ్‌ప్రభాత్‌కు, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉదయ్ స్వరూప రవీంద్ర, మార్కెటింగ్ అండ్ ప్రొటోకాల్ శాఖకు జైకూమార్, వాతావరణం అండ్ వాతావరణ మార్పులు, జంతు శాఖ పంకజ ప్రాండ్యా, ఓబీసీ అండ్ డెయిరీ డెవలప్‌మెంట్ అతుల్ లీలావతీ మోరేశ్వర్, గిరిజన శాఖ మంత్రిగా అశోక్ జానాభాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.  

దేవేంద్ర ఫడ్నవీస్: హోం, విద్యుత్, న్యాయ, పబ్లిసిటీ, ఇన్ఫర్మేషన్ మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

ఏక్‌నాథ్ షిండే:   పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, పబ్లిక్ వర్క్స్

అజిత్ పవార్: ఆర్థిక, ప్లానింగ్, ఎక్సైజ్

చంద్రశేఖర్: రెవెన్యూ శాఖ

మాణిక్ రావు: వ్యవసాయశాఖ