calender_icon.png 3 April, 2025 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏబికేఎంఎస్ ఇన్చార్జిలు వీరే..

02-04-2025 12:01:18 AM

మంచిర్యాల (విజయక్రాంతి): దేశవ్యాప్త బొగ్గు గని కార్మికుల సమస్యల సాధన కోసం బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్, జాతీయ సేఫ్టీ కమిటీ సభ్యులు కొత్త కాపు లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు అఖిల భారతీయ కథాన్ మజ్దూర్ సంఘ్ (ఏబీకేఎంఎస్) - బిఎంఎస్ ఇన్చార్జిలను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిత్వ శాఖ సమన్వయ కమిటీ, ఏబీకేఎంఎస్ ప్రధాన కార్యదర్శి సుజిత్ సింగ్ మంగళవారం నియమించారు.

సంస్థాగత ఇంటర్నల్ ఆడిటర్స్ ఇన్చార్జిలుగా మండ రమా-కాంత్ (సింగరేణి విభాగం, హైదరాబాద్), సురేష్‌రాథోడ్ (జమున, కోల్ కత్త), అధికార ప్రతిని-ధులు (మీడియా ఇన్చార్జులు)గా యాదగిరి సత్తయ్య (అధ్యక్షులు, సింగరేణి విభాగం), జయంత్ అసోల్ (నాగపూర్), అనూప్‌సింగ్ (రాంచి), సుదర్శన్ (మెహంతి, తాల్చేర్), దీపక్ సింగ్ చౌహన్ (నాగపూర్), సంజయ్ సింగ్ (భట్గువ్)లు నియామకమయ్యారు. సేఫ్టీ (రక్షణ) కమిటీ సభ్యులుగా నాతాడి శ్రీధర్ రెడ్డి (సీనియర్ మైనింగ్ సర్దార్, శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి విభాగం), ఉమేష్ కుమార్‌సింగ్ (ధన్‌బాద్), సంజయ్‌సింగ్ (భట్గువ్), జయంత్ అసోల్ (నాగపూర్), సుజిత్ ఝా (నైవేలి), సుస్మితా  పాటిల్ (భసుంధరా), అంగద్ ఉపాధ్యాయ (రాజభ-వనం), లీగల్ సెల్ (న్యాయ విభాగం) ఇన్చార్జీలుగా పులి రాజారెడ్డి (సింగరేణి విభాగం హైదరాబాద్),  పి.మాధవ నాయక్ (సింగరేణి విభాగం కొత్తగూడెం), ఆనంద్ ప్రతాప్ సింహ్ (ఉమ్ రెడ్), సుస్మిత పాటిల్ (భసుంధరా), దిలీప్ సత్ పుతె (చంద్రాపూర్), మెడికల్ (ఫార్మసీ) విభాగం ఇన్చార్జిలుగా పి.మాధవ నాయక్ ( సింగరేణి, కొత్తగూడెం), రాజ్ కుమార్ సింగ్ ( సింగ్రోలి), అక్షర్ కరే మోర్ (సానర్), పెన్షనర్స్ (పదవి విరమణ పొందిన) విభాగానికి మండ రమాకాంత్ ( సింగరేణి హైదరాబాద్), మజ్రుల్ హక్ అన్సారి (బిస్రాంపూర్), అరుణ్ ప్రధాన్ (తాల్చేర్), నారాయణరావు శరత్కర్ (కన్హన్), రవీంద్ర మిశ్రా (దొరి)లు నియామకమయ్యారు.