calender_icon.png 15 November, 2024 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తోడేళ్ల వేటకు థర్మల్ డ్రోన్లు, టెడ్డీ బేర్లు

05-09-2024 12:17:57 AM

  1. తోడేళ్లను పట్టుకునేందుకు అధికారుల వినూత్న ప్రయత్నాలు 
  2. చిన్నారుల మూత్రంలో ముంచి టెడ్డీ బేర్ల ఎర 
  3. రాత్రివేళల్లో థర్మల్ డ్రోన్‌లతో వెతుకులాట

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ఉత్తరప్రదేశ్‌లో తోడేళ్ల బెడదను తప్పించుకునేందుకు అధికారులు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. వాటిని పట్టుకునేందుకు అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తోడేళ్లను బంధించేందుకు వినూత్న విధానాలను ఉపయోగిస్తు న్నారు. టెడ్డీ బేర్ బొమ్మలకు చిన్నారుల మూత్రాన్ని  కలిపి ఎరగా ఉపయోగించడం, రాత్రి వేళల్లో థర్మల్ డ్రోన్లను ఉపయోగించి వాటి ఆచూకీ తెలుసుకుంటున్నారు. ఇలాం టి ప్రత్యేక వ్యూహాలను అవలంబించి తోడేళ్లను ఆకర్షించి అధికారులు వాటిని బంధిం చిగలిగారు. చిన్నారుల మూత్రంలో ముంచి న టెడ్డీలను నది తీరాలు, విశ్రాంత ప్రదేశాల్లో పెట్టి ఫలితం సాధించారు. 

వివిధ ప్రణాళికలతో..

జిత్తులమారిగా పేరుగాంచిన తోడేళ్లు నిత్యం తమ స్థావరాలను మార్చుకుంటాయని యూపీలోని బహరయిచ్ డివిజనల్ ఫారెస్టు అధికారి అజిత్ ప్రతాప్‌సింగ్ తెలిపారు. తోడేళ్లు సాధారణంగా రాత్రివేళల్లో వేటాడుతాయి. ఉదయానికి తిరిగి తమ గుహలు లేదా ఆశ్రయాలకు చేరుకుంటాయి. తోడేళ్లను గందరగోళానికి గురిచేసి వాటి గుహల వద్దనే ఉచ్చులు లేదా బోన్లను ఏర్పా టు చేశారు. ఇందులో భాగంగానే అందులో చిన్నారుల మూత్రంలో తడిపిన టెడ్డీ బేర్లను ఉపయోగించామని ప్రతాప్‌సింగ్ తెలిపారు.

అంతేకాకుండా తోడేళ్లు నివాసముండే ప్రాంతాలను ట్రాక్ చేయడానికి థర్మల్ డ్రోన్లను సైతం ఉపయోగించినట్లు సింగ్ తెలిపారు. బాణసంచా కాల్చడం, శబ్దాలు, ఇతర పద్ధతులను ఉపయోగించి తోడేళ్ల నివాస ప్రాంతాల నుంచి తరిమివేసి వాటిని ఉచ్చు ల వైపుగా వెళ్లేలా వివిధ ఏర్పాట్లు చేశారు. రంగురంగుల దుస్తులు, పిల్లల మూత్రంలో ముంచిన టెడ్డీలను ఇందుకోసం వినియోగించినట్లు చెప్పారు. 

మరో రెండు తోడేళ్లు

తోడేళ్లు, నక్కలు, కుక్కలు ఇలా ఒకే జాతికి చెందిన ఈ జీవులు వివిధ రకాలుగా జీవిస్తాయి. తోడేళ్లను నిర్మూలిం చేందుకు గతంలో బ్రిటిష్ వారు విస్తృతంగా ప్రయత్నాలు చేసినప్పటికీ అవి మనుగడ సాగించగలిగాయి. నదీ తీరాల వెంబడి తమ సంఖ్యను విస్తృతంగా పెంచుకోగలిగాయి. జూలై 17 నుంచి బహరయిచ్‌లోని మహసీ తహసీల్‌లో తోడేళ్లపై దాడులను నిషేధించారు. దీని ఫలితంగా రెచ్చిపోయిన తోడేళ్లు అనేక మందిని పొట్టనబెట్టుకున్నాయి. 9 మంది పిల్లలు, ఒక మహిళ తోడేళ్ల దాడిలో మరణించారు.