calender_icon.png 13 January, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందులో కూడా ఫన్ ఉంది

12-01-2025 12:00:00 AM

సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె తన ఆరోగ్యంపై పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవల తాను చికెన్ గున్యా బారిన పడ్డానని.. అందులోనూ ఫన్ ఉందంటూ ఆమె పోస్ట్ పెట్టారు. సమంత తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే నిత్యం కొంత సమయాన్ని జిమ్ కోసం కేటాయిస్తూ ఉంటుంది.

ఇటీవల ఆమెకు చికెన్ గున్యా వచ్చింది. దాని నుంచి కోలుకుంటూనే మరోవైపు జిమ్‌లో వర్కవుట్స్ చేస్తోంది. దీనిలో భాగంగానే ఆమె జిమ్ చేస్తుంటుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఇన్‌స్టా స్టోరీస్‌లో ఒక పోస్ట్ పెట్టింది. ‘చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడంలోనూ చాలా ఫన్ ఉంది’ అని సమంత బాధతో కూడిన ఎమోజీలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.