calender_icon.png 14 January, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెలవుల్లో జరభద్రం:ఎస్పీ జానకీ

14-01-2025 12:48:45 AM

మహబూబ్ నగర్ జనవరి 13 (విజయ క్రాంతి): తల్లిదండ్రులు వారి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎల్లప్పుడూ పర్యవేక్షణ చేస్తూ ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. సంక్రాంతి సెలవులు వచ్చి న సందర్భంగా పిల్లలు వారి ఇష్టానికి వాహ నాలను తోలడం, చెరువులకు వెళ్లి ఈత కొట్టడం వంటివి చేస్తుంటారని ప్రత్యేక జాగ్ర త్తలు తీసుకొని ఉండాలని సూచించారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో బైకులు ఇవ్వకూడ దని తల్లిదండ్రులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే పిల్లలకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలియజేశారు. ఎ లాంటి ఆందోళన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో సంక్రాంతి వేడుకలు జరు పుకోవాలని సూచించారు. ఏమైనా ఇబ్బం దులు ఉంటే 100కు డయల్ చేయాలని పేర్కొన్నారు.