30-01-2025 12:00:00 AM
జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి
పెన్ పహాడ్, జనవరి 29 : యాసంగి లో వరి సాగు చేసిన రైతులు, ఇతర పంట లు సాగుకు అవసరమయ్యే యూరియా అందుబాటులో ఉందని రైతులు అదైర్యపడ వద్దని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలం లోని అనంతారం కార్యాలయాన్ని సంద ర్శించి మాట్లాడారు.
మండలంలో ఉన్న ఫర్టిలైజర్ షాప్స్, కార్యాలయాల ద్వారా యూరియా, ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా కార్యా లయంలో ఉన్న గోదాంలో నిల్వ ఉన్న యూరియా, ఎరువుల బస్తాలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు.
అంతేకాకుండా అందుబాటులో ఉన్న రైతులతో మాట్లా డుతూ.. రైతులు ద్రవ రూపంలో ఉన్న నా నో యూరియాతో పాటు, పురుగుల మందును పిచికారీ చేస్తే అధిక లాభాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఏఓ అనిల్ కుమార్, ఏఈఓ శ్రావణి, సిబ్బంది లక్ష్మారెడ్డి, సతీష్, రైతులు ఉన్నారు..