calender_icon.png 10 January, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేట్ల కోత ఉండదు

12-12-2024 12:00:00 AM

ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు మిశ్రా

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో కొనసాగు తున్నందున వచ్చే ఫిబ్రవరి పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గించడానికి రిజర్వ్‌బ్యాంక్‌కు ఎటువంటి అవకాశం ఉండదని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు, యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ నీలకాంత్ మిశ్రా చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరిలోనే కాకుం డా 2025 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కూడా రేట్ల తగ్గింపు ఉండకపో వచ్చని అంచనా వేశారు.

ఆర్బీఐ గవర్నర్ మార్పుతో ఫలితం ఉండదని, ఆర్బీఊ సంస్థాగత సామర్థ్యం చాలా పటిష్టంగా ఉన్నదని మిశ్రా వ్యాఖ్యానించారు. 2026 ఆర్థిక సంవత్సరం లో సగటు ద్రవ్యోల్బణం అంచనా 4.5 శాతంగా ఉన్నందున, వచ్చే 13 నెలల్లో రేట్ల కోత సాధ్యపడదని తెలిపారు. 2025 క్యూ3లో మాత్రమే ద్రవ్యోల్బణం 4 శాతానికి దిగివస్తుందని, మొత్తం ఏడాదికి సగ టు 4.5 శాతంగానే ఉంటుందన్నారు.