calender_icon.png 24 October, 2024 | 10:51 AM

విద్యుత్ చార్జీల పెంపు ఉండదు

24-10-2024 02:38:08 AM

  1. గృహ వినియోగదారులపై భారం వేయట్లేదు
  2. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): పేద, మధ్య తరగతి గృహవినియో గదారులపై ఎలాంటి భారం వేయట్లేదని, వారి విద్యుత్ చార్జీలపై ఎలాంటి పెంపు ఉండదని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ము షారఫ్ ఫా రూఖీ తెలిపా రు. బుధవారం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) బహిరంగ విచారణ సందర్భంగా ఫారూఖీ వారి ప్రతిపాదనలు వెల్లడించారు.

నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారుల ఫిక్స్‌డ్ చార్జీలపై స్వల్ప పెంపును ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనను ప్రోత్సహించడం కోసం ఎలక్ట్రికల్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్స్‌కు ఫిక్స్‌డ్ చార్జీల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

సంస్థ పరిధిలో గరిష్ఠ డిమాండ్ 9,910 మెగావాట్లకు చేరిందని, రాష్ట్రవ్యాప్తంగా 15,623 మెగావాట్ల డిమాండ్ ఉందని తెలిపారు. పంపిణీ నష్టాలను 4.75 శాతానికి తగ్గించామని, ప్రతి యూనిట్‌కు రూ.6.45 స్పెసిఫిక్ రెవెన్యూ వస్తున్నదని స్పష్టం చేశారు. మెయింటెనెన్స్, రిపేర్ పనుల్లో పారదర్శకత కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టీజీఏఐఎంఎస్ యాప్‌ను రూపొందించినట్లు వెల్లడించారు.