పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
నిజాంబాద్, డిసెంబర్ 22 (విజయక్రాం తి): చిత్ర పరిశ్రమపై ప్రభుత్వం సాధింపు చర్యలకు పాల్పడుతోందని బండి సంజయ్ ఆరోపణలు చేయడం సరికాదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. చిత్ర పరిశ్రమపై ప్రభుత్వం ఎలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడదన్నారు. ఆదివారం నిజామాబాద్‌లో ఆయన మాట్లాడారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం కృషితోనే చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిందన్నారు. అనేక స్టూడియోలా నిర్మాణా లకు భూములు ఇచ్చి ప్రోత్సహించిందని మహే ష్‌కుమార్‌గౌడ్ గుర్తు చేశారు. ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే ఎవరినైనా ఉపేక్షించబోమన్నారు. రక్షణ ఏర్పాట్లు చేయకపోవడంతోనే సంధ్య థియేటర్ వద్ద తొక్కిస్తాలాటలో మహిళ చనిపో యిందన్నారు. ఆమె కొడుకు ఆసుపత్రులో ఉంటే బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు ఎందు కు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.