calender_icon.png 8 February, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముమ్మాటికీ బై ఎలక్షన్ వస్తది

07-02-2025 10:48:19 PM

పది స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది..  

రాజేంద్రనగర్ నుంచి నేను పోటీ చేస్తాను..

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి...  

రాజేంద్రనగర్: రాష్ట్రంలో త్వరలో ముమ్మాటికి బై ఎలక్షన్ వస్తుందని, పది స్థానాల్లో తమ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీరం చెరువులో కార్పొరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు నాగరాజు ఆఫీస్ లో విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, ఆయా స్థానాల్లో తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయని ఆయన తెలియజేశారు. తాను తప్పకుండా రాజేంద్రనగర్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తా అన్నారు.

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో ఆ పార్టీ మీద జనాల నుంచి ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ బిఆర్ఎస్ అధ్యక్షుడు సీతారామ్ ధూళిపాళ్ల తదితరులు పాల్గొన్నారు.