calender_icon.png 9 October, 2024 | 1:49 AM

సామూహిక అత్యాచారం జరగలేదు

08-10-2024 01:38:25 AM

సంజయ్‌రాయ్ ప్రధాన నిందితుడు

కోల్‌కతా రేప్‌కేస్‌లో సీబీఐ స్పష్టం 

కోల్‌కతా, అక్టోబర్ 7: కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్య కేసులో సీబీఐ తన చార్జిషీట్‌ను సమర్పించింది. సోమవారం మధ్యా హ్నం సీల్దాలోని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను న్యాయమూర్తి ముందుంచారు సీబీఐ పోలీసులు. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఆ ఘోరానికి పాల్పడినట్లు రిపోర్టులో తెలిపింది. గ్యాంగ్ రేప్ జరగలేదు అని స్పష్టం చేసింది.

పోలీసు శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా చేసిన సంజ య్ ఆ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పీజీ డాక్టర్‌ను సంజయ్ రేప్ చేసి, మర్డర్ చేసినట్లు సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. దాదాపు 200మంది వాంగ్మూలాలు నమోదయ్యాయని సీబీఐ చార్జిషీట్ లో తెలిపింది.

ఈ యేడాది ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీకర్ ఆసుపత్రిలో బ్రేక్ టైంలో సెమినార్ రూమ్‌లో నిద్రించేందుకు వెళ్లిన పీజీ వైద్యురాలిపై సంజయ్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను కిరాతకంగా చంపేశాడు. ఈఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు, సిబ్బంది, మెడికల్ విద్యార్థులు చేపట్టిని నిరసనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.