calender_icon.png 25 March, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీలిమిటేషన్‌పై చర్చే జరగలేదు

24-03-2025 12:50:38 AM

  1. తప్పుడు ప్రచారంతో దిగజారుడు రాజకీయాలు 
  2. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ ఎస్ అసలు రంగు బయటపడిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు.

పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై చెన్నులో జరిగిన సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు పోటీపడి మాట్లాడటం, వారి నిజస్వరూపాన్ని బయటపెట్టిందన్నారు. దేశంలో లేని సమస్యను సృష్టిం చి, బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని ఆరోపించారు.

నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటివరకు పార్లమెంట్‌లో లేదా క్యాబినెట్‌లో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. అవకాశవాద పార్టీలు దక్షిణాదికి అన్యా యం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తూ, దిగజరారుడు రాజకీయాలకు తెరలేపుతున్నాయని వాపోయారు.

తమిళ నాడులో డీఎంకే పార్టీ అవినీతి, కుంభకోణాలతో అపవాదు ముటగట్టుకుందని, దీని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే డీలిమిటేషన్ పేరిట కొత్త నాటకానికి తెరలేపారన్నారు. దక్షిణాదిలో బీజేపీ బలప డకూడదనే రాజకీయ కుట్రకోణమూ ఇందులో దాగిఉందని ఆరోపించారు.

జనాభా లెక్కలే షురూ కాలేదు..

జనాభా లెక్కల సేకరణ ఇంకా ప్రారంభమే కాలేదని.. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కానీ అవకాశవాద పార్టీలు దక్షి ణాదికి అన్యాయం జరుగుతోందని తప్పు డు ప్రచారం చేస్తున్నాయని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి నాటకమడుతుం దని ఆరోపించారు.

కర్ణాటక, తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. గత పార్లమెం ట్ ఎన్ని కలతో పాటు, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రజలు బీజేపీకి మద్దతుగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. కుటుంబ పార్టీ లు, అసమర్థ పార్టీలు ముఠాగా ఏర్పడి, మో దీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా వివక్ష లేకుండా అభివృద్ధి ఎజెండాతో మోదీ సర్కారు ముందుకెళ్తున్నదని చెప్పారు.

అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి

డీలిమిటేషన్‌పై అసత్య ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశా రు. డీలిమిటేషన్‌కు సంబంధించిన చట్టాలన్నీ కాంగ్రెస్ హయాంలో చేసినవేనన్నారు. డీలిమిటేషన్ జరగాలంటే ముందుగా జనా భా లెక్కల సేకరణ జరగాలని.. పార్లమెంట్‌లో చట్టం చేయా లంటే మేధావులు, రాష్ర్ట ప్రభుత్వాల సలహాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందులో రాష్ర్ట ప్రభుత్వాల పాత్ర చాలా కీలకమన్నారు.

డీలిమిటేషన్ పేరిట ఏదో అన్యాయం జరుగబోతోందంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే సమావేశంలో పాల్గొని ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. రేవంత్‌రెడ్డి గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టిపెడితే బాగుంటుందన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రె స్, మజ్లిస్ పార్టీలు ఒక్కటైనా తెలంగాణ ప్రజల మద్దతుతో బీజేపీకే ఉంటుదన్నారు.