03-03-2025 12:00:00 AM
హుజూర్నగర్, మార్చి 2 : వేసవిలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఎలాంటి అంత రాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగే విధంగా తగిన చర్యలు చేపట్టాలని జిల్లా ప్రత్యేక అధికారి చీఫ్ ఇంజనీర్ ఏ కామేష్ హుజూర్నగర్ డివిజన్ విద్యుత్ శాఖ సిబ్బందిని ఆదేశించడం జరిగింది.
మండల పరిధిలోని అనుములగూడెం సబ్ స్టేషన్,మద్దుమ్ నగర్ లోని సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ సందర్శించి అక్కడి వినియోగదారులతో సంభాషించడం జరిగింది.వారి ఆదేశాను సారం హుజూర్ నగర్ డివిజన్లోని ప్రతి సిబ్బంది వారి సంబంధిత గ్రామాలలో ఉన్న వినియోగ దారులతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయించి 24 గంటలలో ఎప్పుడైనావిద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిన వాట్సప్ గ్రూప్ ద్వారా తెలియ చేసినట్లయితే సత్వరమే పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుందని ఆదేశించడం జరిగినది.
మఠంపల్లి మండలంలోని బక్కమంతులు గూడెం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న టువంటి సబ్ స్టేషన్ లో కొత్త బ్రేకర్ తో కస్తూర్బా స్కూల్ ఫీడర్నిచార్జ్ చేసి రఘునాధ పాలెం పీడర్ మీద ఉన్నటు వంటి అధిక లోడు డైవర్ట్ చేయడం జరిగింది.బక్క మంతులగూడెం పరిసర గ్రామాల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించ డం జరిగింది.