calender_icon.png 19 January, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసుల విచారణలో పారదర్శకత ఉండాలి

19-01-2025 12:00:00 AM

ఎస్పీ జానకి 

మహబూబ్ నగర్ జనవరి 18 (విజయ క్రాంతి) : కేసుల విచారణలో పారదర్శకత ఉండాలని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. శనివార%ళి% పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు కోర్టు డ్యూటీ అధికారులు, కోర్టు లైజన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల విచారణలో వేగంగా చేసేందుకు కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని, న్యాయ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

కోర్టు సంబంధిత రికార్డుల నిర్వహణ, సమన్లు, వారంట్లు అమలు చేయడం, కేసులపై సమయానికి నివేదికలు సమర్పించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణా రెడ్డి, సుదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు