calender_icon.png 16 January, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాల్లో పర్యవేక్షణ ఉండాలి

01-09-2024 12:19:27 AM

ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాం తి): గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టల్ విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని, గురుకులల్లో నిత్యం ఏదో ఒకచోట ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకుల విద్యాలయాలపై నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సంక్షేమంపై అధికారులు దృష్టి సారించడంలేదని, దీంతో విద్యార్థులు సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. గురుకుల, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.