మహబూబ్ నగర్, జనవరి 29 (విజయ క్రాంతి) : భద్రంగా ఇంటికి చేరాలని బాధ్యత ప్రతి ఒక్క వాహన చోదకునిపై ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల ఆధ్వ ర్యంలో నిర్వ హించిన భారీ బైక్ ర్యాలీ కార్యక్రమా న్ని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి జెండా ఊపి ప్రారం భించారు.
ఈ సందర్భంగా కలె క్టర్ మాట్లాడుతూ చిన్న చిన్న పొరపాట్ల వల్ల తిరుగులేని సమస్యలను మన కుటుంబా లకు ఇచ్చిన మిగిలిపోతామనే ఆలోచన ప్రతి ఒక్కరిపై ఉండాలని పేర్కొన్నారు. అప్పుడే రోడ్డు ప్రమా దాలు సంభవించకుండా ప్రశాంతమైన వాతావర ణంలో ప్రతి ఒక్కరు త మ తమ గమ్యస్థానాలకు చేరుతారని సూ చించారు.
జిల్లా ఎస్పీ డి జానకి, డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) సెక్రటరీ శ్రీమతి ఇందిరా దేవి, స్థానిక అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అదనపు ఎస్పి రాములు, ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ ఎం.కిషన్, ట్రాఫిక్ డి.ఎస్.పి సుదర్శన్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, ఉమెన్ పి.ఎస్ ఇన్స్పెక్టర్, శ్రీనివాసులు, ఎం.వి.ఐ,డి.టి.ఒ, రఘు కుమార్, ఆర్.ఐ లు కష్ణయ్య, రవి మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.