నిర్మల్ (విజయక్రాంతి): సమాజాన్ని చైతన్యం చేసే కవితలు రావాలని నిర్మల్ పట్టణ సీఐ రామకృష్ణ కలం స్నేహం సాహిత్య సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం దేవరకోటిలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. కలం స్నేహం కవులందరూ కూడా సమాజ హితం కోసం పనిచేయాలని సిఐ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణంరాజు, నేరెళ్ల హనుమంతు, రవి కాంత్, రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.