27-03-2025 06:36:34 PM
వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు..
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఒకే దేశం ఒకే ఎన్నిక జరగాలని వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు అన్నారు. గురువారం జైనూర్, కెరామేరి, సిర్పూర్ యు, లింగాపూర్ మండలాలలో ఒకే దేశం ఒకే ఎన్నికపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలంతో కలసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దశల వారి ఎన్నికలు నిర్వహించడంతో సమయం వృధా అవ్వడంతో పాటు ఆర్థిక భారం పడుతుందన్న ఉద్దేశంతో బిజెపి పార్టీ ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలన్న సంకల్పంతో ప్రజా అభిప్రాయ సేకరణ చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మండల కన్వీనర్ గడ్డల కరణ్ ఆయా మండలాల కన్వీనర్లు, కో కన్వీనర్లు, బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.