19-03-2025 04:38:56 PM
స్పెషలాఫీసర్ తో మాట్లాడిన వెల్లుట్ల సంతోష్ కుమార్....
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో పశువుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం లక్షలు నిధులు వేచ్చించి నిర్మించిన నీటితొట్టీలు నిరుపయోగంగా మారాయి అని గ్రామస్తులు అంటున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల నాయకులు వెల్లుట్ల సంతోష్ కుమార్ బుధవారం వెల్లుట్లలోని పశువుల నీటితొట్టిలను పరిశీలించారు. పశువుల నీటి తొట్టె నిర్వహణ సక్రమంగా లేక శిథిలావస్థతో పాటు చెత్త కుండీనీ తలపిస్తున్నాయి. దీంతో వెల్లుట్ల గ్రామంలో పశువులను నీటి తొట్లల్లో నీరులేక నీటి కోసం చెరువులకో, లేక బోరుబావుల వద్దకో తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితున్నాయి.
ప్రభుత్వం మూగ జీవాలకు తాగునీరు అందించేందుకు శిధిలావస్థలో వున్న నీటి తొట్టెలను శుభ్రం చేసి నీటినీ నింపి గ్రామ రైతుల పశువులకు నీటి సౌకర్యం కల్పించలని శిథిలావస్థకు చేరిన వాటిని నీటితొట్లలో పిచ్చిమొక్కలు, చెత్తచెదారంతో నిండి నిరుపయోగంగా ఉన్న వాటిని శుభ్రం చేయాలని అధికారులతో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ఫోన్ లో మాట్లాడారు. వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు తమ గ్రామాలలో శిథి లావస్థలో వున్న నీటి తొట్టెలను వెంటనే బాగుచేయించాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు యమా రాజయ్య, ఓట్లమ్ సాయిలు, ప్రకాష్, కన్నెబోయిన బాపురాజు పాల్గొన్నారు.