11-03-2025 07:35:11 PM
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...
మునుగోడు/గట్టుప్పల (విజయక్రాంతి): ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పంటలు ఎండిపోకుండా కాపాడాలని నియోజకవర్గ వ్యాప్తంగా సమస్యలు లేకుండా చూడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్యుత్ అధికారుకు సూచించారు. లో వోల్టేజ్ సమస్య వల్ల పంటలు ఎండిపోతున్నాయని గట్టుపల్ మండలానికి చెందిన కొందరు రైతులు హైదరాబాదులో ఆయన నివాసంలో కలిసి వినతి అందజేశారు. రైతుల సమస్యను విన్న ఎమ్మెల్యే తక్షణమే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి లో వోల్టేజ్ సమస్యను సత్వరమే పరిష్కరించాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మండలాల వారీగా ఎక్కడెక్కడ లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయనే పూర్తి సమాచారం స్థానిక నాయకుల ద్వారా సేకరించి సత్వరమే పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.