calender_icon.png 19 April, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గన్ని సంచుల కొరత ఉండొద్దు: నంబూరి

09-04-2025 10:33:01 PM

పేరువంచ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు..

కల్లూరు (విజయక్రాంతి): మండల పరిధి పేరువంచ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొలుగోలు కేంద్రాన్ని బిజెపి ఖమ్మం పార్లమెంటరీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వర రావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాల్లో తగినన్ని గన్ని సంచులు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే గన్ని సంచుల కొరత లేకుండా చూడాలని అన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉందని, ఆలస్యం చేయకుండా రైతులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు.

మంగళవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిందా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు చెప్పిన సమస్యలు విని జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కిషాన్ మోర్చా మండల అధ్యక్షుడు అనంగీ నరసింహారావు, ఎస్సీ మోర్చా నాయకులు కల్లెపల్లి భీమరాజు, కల్లూరు మండల కార్యదర్శి మండవ వెంకటరామిరెడ్డి, గుండపునేని అనిల్ కుమార్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.