జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్
కామారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థులకు అందించే బోజనంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా గాంధారి కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థినులకు ఏర్పాటు చేసిన భోజనంను ఆయన పరిశీలించారు. వంటలు తయారు చేసే సమయంలో శుభ్రత పాటించాలన్నారు. ప్రతి వంటకంపై మూతలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యార్థులు హ్యాండ్ వాష్ సరిగా చేస్తున్నారో లేదో పరిశీలించాలని సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.