అక్కన్నపేటలో ఇందిరమ్మ ఇంటి సర్వే పరిశీలించిన జడ్పీ సీఈవో...
రామాయంపేట: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఏలాంటి అవకతవకలు జరగకుండా పగడ్బందీగా సర్వే చేయాలని జడ్పీ సీఈవో అధికారులకు సూచించారు. శనివారం రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇంటి సర్వే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సర్వే పూర్తయిన తర్వాత అర్హులను గుర్తించి ఆన్లైన్ చేసేటప్పుడు పకడ్బందీగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా సర్వే చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆయన వెంట అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.