calender_icon.png 15 March, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోఓల్టేజీ సమస్య లేకుండా చూడాలి

12-03-2025 01:35:33 AM

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు, మార్చి 11 :  మునుగోడు నియోజకవర్గంలో విద్యుత్ లోఓల్టేజీ సమస్య లేకుండా  అధికారులు చర్యలు తీసుకోవా లని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచించారు. లో ఓల్టేజ్ కారణంగా మోటా ర్లు కాలిపోయి పంటలు ఎండిపోతున్నాయని గట్టుపల్ మండలానికి చెందిన పలువురు రైతులు  హైదరాబాద్‌లో ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి చెప్పారు.

స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి  సమస్య సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. నియోజకవర్గంలో మండలాల వారీగా  ఎక్కడెక్కడ లోఓల్టేజ్  సమస్యలు ఉందో సమాచారం సేకరించి పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.