calender_icon.png 22 April, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో అనర్హులు ఉండొద్దు

22-04-2025 01:27:45 AM

రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్

కొండపాక ఏప్రిల్ 21: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపికైన లబ్ధిదారుల్లో అనర్హులు ఉండకూడదని రాష్ట్ర గృహ నిర్మా ణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి గౌతమ్  ఆదేశించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల ప్రగతిపై అధికారులతో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ యం.డి వి.పి గౌతమ్ మాట్లాడుతూ రూ.5ల క్షలతో ఇంటి నిర్మాణం ఏ విధంగా సాధ్యమన్న సందేహాన్ని తీర్చి లబ్దిదారుల్లో నమ్మకాన్ని కల్పించేలా జిల్లాలో అన్ని మం డలాల్లోని  గ్రామాలలో ఇందిరమ్మ మోడల్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. 

ఇందిరమ్మ ఇళ్ల కొరకు వచ్చిన దరఖాస్తులలో స్థలం ఉండి పూర్తిగా ఇళ్లు కట్టుకునె స్థోమత లేని నిరుపేదలను మాత్రమే గుర్తించాలని, ఆర్థిక సహకారం కోరుకునే వారికి మహిళా సమాఖ్యల ద్వారా రుణం ఇప్పించేలా అధికారులు చొరవ చూపించాలన్నారు.

ప్రాధాన్యత క్ర మంలో పూర్తయ్యే ఇంటి నిర్మాణ పనులను పంచాయితి సెక్రటరి పోర్టల్ లో నమోదు చేయాల్సిన అవసరం ఇప్పుడు లేద ని, లబ్దిదారుడె తన స్మార్ట్ ఫోన్ లో ఇందిరమ్మ ఇండ్లు అనే ఆప్ ను డౌన్ లోడ్ చేసుకొని దానిలో ఎప్పటికప్పడు ఫోటోలను అప్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఉందన్నారు. ఫోటోల ఆ ధారంగా బిల్లుల ఆలస్యం ఉండదని స్పష్టంచేశారు. అప్ లోడ్ చేసిన ఫోటోలను యంపిడిఓలు, ఏఈలు సూపర్ చెక్ చేయాలన్నారు.

లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా, స్థానికంగా నివాసం ఉంటూ, ఇల్లు కట్టుకునే స్తోమత లేని బి.పి.ఎల్ కు చెందిన వారిని మాత్రమే ఎంపిక చేయాలని, ఇందిరమ్మ కమిటిలు గుర్తించిన వారిలో సైతం అధికారులు మరోసారి పరిశీ లించాలని సూచించారు. క్షేత్రసాయిలో పర్యటిస్తూ, లబ్దిదారులు రూ.5లక్షల్లో ఇళ్లు కట్టుకోవడంలో ఎదుర్కొనే సమస్య లు తెలుసుకుని అవసరమైన సహాయ, సహకారాలు అందించాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్, హౌసింగ్ పిడి దామోదర్ రావు, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డిఓలు చంద్రకళ, రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపిడిఓలు, పంచాయితీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి  డిఈ లు ఇతర శాఖల అధికారులు పాల్గోన్నారు.