ఉప్పరిగూడలో కుటుంబ సర్వేను పరిశీలిస్తున్న కలెక్టర్ నారాయణ రెడ్డి
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
ఇబ్రహీంపట్నం, నవంబర్ 10: కుటుంబ సర్వేలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా వివరాలు నమోదు చేయాలని ఎన్యుమరేటర్లకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఉప్పరిగూడలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టర్ పరిశీలించారు. సర్వేకి వచ్చే ఎన్యుమరేటర్లకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ వెంకటమ్మ, తహసీల్దార్ సునీతా రెడ్డి, ఉప్పరిగూడ గ్రామ కార్యదర్శి రిషిక నేత, బాగాయత్ ఆర్ఐ పుష్పలత, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఓటరు నమోదు పరిశీలన
అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 10: ఓటరు కార్డుల్లో మార్పు చేర్పులపై అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో కొనసాగుతున్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఆదివారం ఆర్డీవో పరిశీలించారు. అనంతరం సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, ఆర్ఐ ఇంద్రాణి, బీఎల్వోలు పాల్గొన్నారు.